about - రుణమాఫీ పథకం అమలు – రైతుల సమస్యలపై కిసాన్ మిత్ర ఫాలోఅప్
ఋణ మాఫీ సమస్యల పరిష్కారంలో కిసాన్ మిత్ర కీలక పాత్ర పోషించింది.మా సిబ్బంది స్థానిక వ్యవసాయ, బ్యాంకు అధికారులతో నిరంతరం ఫాలోఅప్ చేశారు.
2023 లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భారం తగ్గించేందుకు రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకం ప్రకారం, 2018 డిసెంబర్ 11 నుండి 2023 డిసెంబర్ 9 వరకు పంట రుణం తీసుకున్న రైతులు అర్హులు.
ప్రభుత్వ వాగ్దానం:
ప్రతి రైతు కుటుంబానికి గరిష్టంగా ₹2 లక్షల వరకు రుణమాఫీ.
కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్‌కి వచ్చిన స్పందన
ఈ పథకం ప్రారంభం తర్వాత కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్‌కు మేము పని చేస్తున్న జిల్లాల నుండి మొత్తం 206 కేసులు వచ్చాయి. ఋణ మాఫీ సమస్యల పరిష్కారంలో కిసాన్ మిత్ర కీలక పాత్ర పోషించింది.మా సిబ్బంది స్థానిక వ్యవసాయ, బ్యాంకు అధికారులతో నిరంతరం ఫాలోఅప్ చేశారు.
ప్రధాన సమస్యలు
- రేషన్ కార్డు ఆధారంగా పథకం వర్తింపు:
- ఒకే కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ వేర్వేరు రుణాలు తీసుకున్నప్పటికీ, ఒకే రేషన్ కార్డులో ఉన్నందున మాఫీ కాలేదు.
- వ్యవసాయ అధికారులు ఫ్యామిలీ వెరిఫికేషన్ చేసినప్పటికీ, కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
- ఒకే రేషన్ కార్డులో వేరు వేరు కుటుంబాల వివరాలు చూపించడం.
- ఫ్యామిలీ వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉండడం
- రేషన్ కార్డు లేకపోవడం
- బ్యాంకు, భూమి రికార్డులు & ఆధార్‌లో పేరు తేడా ఉండడం.
- ₹2 లక్షలకు పైగా ఉన్న రుణాలు పథకానికి అర్హం కానివి కావడం
- ఒకే ఆధార్ కానీ వేరు వ్యక్తి పేరుతో రుణం చూపించడం.
- ఆదిలాబాద్ జిల్లాలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పాత డేటా ఇవ్వడం దీనివల్ల కొంతమంది రైతుల రుణం మాత్రమే మాఫీ అయింది.
- కొత్తగా పంట రుణం తీసుకున్న వారు లేదా 2 లక్షల లోపు
రుణం ఉన్నవారు మాఫీ పొందలేదు.
- బ్యాంక్ వారు అప్డేటెడ్ డేటా పంపినా, అది ఇంకా పెండింగ్‌లో ఉంది.
- DBT (Direct Benefit Transfer) లో సాంకేతిక సమస్యలు
- డేటా కనపడకపోవడం / మిస్ అయిన రికార్డులు
- పట్టా పాస్‌బుక్ లేకపోవడం (పహాణి ఆధారంగా రుణం తీసుకున్న రైతులు)
కిసాన్ మిత్ర ఫాలోఅప్ చర్యలు
ప్రతి రైతు రుణ స్థితిని చెక్ చేసి, మాఫీ కాలేని కారణాలను రైతులకు వివరించాము. వ్యవసాయ, మరియు బ్యాంకు అధికారులతో తరచుగా ఫాలోఅప్ చేశాం. ఋణ మాఫీ సమస్యలను పరిష్కరించడానికి స్థానిక స్థాయిలో ఫిర్యాదుల పరిష్కారం మరొక కీలకమైన విధానం. రైతుల సమస్యలను నేరుగా వినడానికి క్షేత్ర బృందం గ్రామ, మండల స్థాయిలో చర్చలు, సమావేశాలను నిర్వహించింది.
జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా కలెక్టర్ గార్లకు వివరాలతో లెటర్లు సమర్పించింది.ఆదిలాబాద్ జిల్లా పైలట్ ప్రజా వాణిలో రైతులతో అనేక దరఖాస్తులు పెట్టించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి గారి దృష్టికి కూడా సమస్యలను తీసుకెళ్లింది. సీఎం ప్రజా వాణిలో కూడా దరఖాస్తులు సమర్పించింది.
ప్రస్తుత స్థితి
ఈ సమస్యలు చాలా వరకు రాష్ట్ర స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి.
జిల్లా అధికారులు తమ స్థాయిలో ప్రక్రియలు పూర్తి చేసి పంపించినప్పటికీ, రాష్ట్ర స్థాయిలో పరిష్కారం జరగలేదు.
రైతులు ఈ పరిస్థితిపై నిరాశతో ఉన్నారు.
కిసాన్ మిత్ర అభ్యర్థన
రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా అర్హులైన రైతుల సమస్యలను పరిష్కరించి, రుణమాఫీ మొత్తాన్ని విడుదల చేయాలని కిసాన్ మిత్ర చేస్తున్నది.
V. Bhargavi Gupta
Kisanmitra, State Coordinator
No comments yet. Login to start a new discussion Start a new discussion