about - పిడుగు పాటు మరణాలకు పరిహారం అందించాలని కిసాన్ మిత్ర కృషి

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ ( ప్రస్తుతం బోరజ్ ) మండలం గిమ్మ గ్రామానికి 2024 మే 12 న కిసాన్ మిత్ర ఫీల్డ్ కో ఆర్డినేటర్ లు వెళ్ళి ఆ గ్రామంలో పిడుగుపాటుతో చనిపోయిన రెండు కుటుంబాలను కలిశారు.

 · 2 min read

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ ( ప్రస్తుతం బోరజ్ ) మండలం గిమ్మ గ్రామానికి 2024 మే 12 న కిసాన్ మిత్ర ఫీల్డ్ కో ఆర్డినేటర్ లు వెళ్ళి ఆ గ్రామంలో  పిడుగుపాటుతో చనిపోయిన రెండు కుటుంబాలను కలిశారు.

ఈ ఘటనలో ౩౩ సంవత్సరాల వయసున్న మంద సంటెన్న s/o రాములు మరణిచారు. ఆయనకు భార్య (రజిత) ఇద్దరుపిల్లలు  కూతురు (శ్రీకన్య 7 సంవత్సరాలు) కొడుకు      (శ్రీకంటేశ్వర్,  5 సంవత్సరాలుఉన్నారు. కూతురు గిమ్మ ప్రభుత్వ పాఠశాలలో2వ తరగతి చదువుతున్నది. కుటుంబానికి స్వంత భూమి లేదు. కూలి పనికి వెళతారు. కుటుంబానికి 1 లక్ష వరకూ అప్పులున్నాయి.

ఈకుటుంబానికి న్యాయం జరగాలని, వారికి పరిహారం అందాలని కిసాన్ మిత్ర భావించింది. ఘటనపై  స్థానిక మండల రెవెన్యు కార్యాలయంలో అన్ని డాక్యుమెంట్లు సమర్పించింది. .కానీ అధికారులు పట్టించుకోలేదు. ఇదే సమస్యపై  జిల్లాలో కొనసాగుతున్న ప్రజావాణి  పైలట్ కార్యక్రమం లో మళ్ళీ దరఖాస్తు పెట్టించారు.


ఈ కుటుంబం పబ్లిక్ హియరింగ్ రోజు  జైనథ్ కు  వచ్చారు. అక్కడ MRO గారిని కలసి  గతంలోనే ఈ ఘటనపై  ఆఫీస్ లో డాక్యుమెంట్లు ఇచ్చామని దృష్టికి తెచ్చాము. తమ కార్యాలయం నుండీ  RDO కి ఈ సమస్యపై రాసిన ఒక లెటర్ రెవెన్యు అధికారులు  ఇచ్చారు. దీని ఆధారంగా RDO కార్యాలయానికి వెళ్ళి  వీరి ఫయిల్  ఎక్కడ పెండింగ్ లో ఉనే తెలుసుకుంటే, జిల్లా కలెక్టరేట్ కు పంపినట్లు చెప్పారు.

వెంటనే కలెక్టరేట్ లో  C section కి వెళ్ళి అడిగితే వాళ్ళు మాకు ఇంకా ఈ పైల్ రాలేదన్నారు.మళ్ళీ RDO office కి వెళ్ళి  వాళ్ళు పంపిన ఫయిల్ చూస్తే సహాయం  ఆపద్భందుకింద అందించాలని రాశారు. పిడుగు పాటుకు సహాయాన్ని ఆపద్భందు క్రింద అందిస్తే, ఆ కుటుంబానికి అన్యాయం జరుగుతుందని,  జీవో ప్రకారం వారికి హక్కుగా రావలసిన  6 లక్షల రూపాయలు రాక నష్ట పోతారని అధికారుల దృష్టికి తెచ్చాము.  అధికారులు జీవో ప్రకారం సరి చేసి ఫైల్ మళ్ళీ పంపారు.

కొన్ని రోజులకు కలెక్టరేట్ C section నుండి ఫోన్ వచ్చింది, ఈ కుటుంబ సభ్యుల  ఆధార్ కార్డు కావాలని కోరారు. మేము మళ్ళీ ఆ కుటుంబాన్ని కలసి, ఆధార కార్డ్ సేకరించి, అధికారులకు అందించాము. ఈ ఫైల్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు.

మండలంలో జరిగిన పబ్లిక్ హియరింగ్ రోజు ఈ కుటుంబం పరిస్థితి  RDO గారి దృష్టికి  తెచ్చి, కుటుంబంలో  పిల్లలు చిన్నగా ఉన్నారనీ, వారికి ఇతర పథకాలలో సహాయం కావాలనీ కోరాము.  

“మిషన్ వాత్సల్య”  స్కీమ్ ద్వారా పిల్లలకు సహాయం .....

RDO గారు ఇతర అధికారుల తో చర్చిస్తే,  అక్కడే ఉన్న ICDC నుండి వచ్చిన అధికారులు, “మిషన్ వాత్సల్య” అనే స్కీమ్ గురించి  చెప్పారు. నిజానికి ఈ స్కీం తల్లి, తండ్రి ఎవరూ లేని పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.

పబ్లిక్ హియరింగ్ అయిన తరువాత మళ్ళీ అధికారులతో చర్చిస్తే, ICDS office కి వెళ్ళి ఒకసారి మాట్లాడండని సూచించారు. నేను రాష్ట్ర అధికారులను కలసి ఈ పిల్లల గురించిచెప్పాను. ఆ స్కీం అమలు కోసండాక్యుమెంట్లు ఏమేమి కావాలో అధికారులు చెప్పారు.

కుటుంబ సభ్యులకు చెప్పి SBI లో పిల్లల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయించాము. పిల్లల బోనోపైడ్స్ ,అందరి ఆధార్ కార్డ్స్, డెత్ సర్టిఫికెట్, డిపెండెంట్ సర్టిఫికెట్తీసుకొని ఆఫీస్ లో ఇచ్చాము.

ICDS నుండి కేంద్ర ప్రభుత్వానికి ఈ పిల్లల వివరాలన్నీ పంపిస్తాము, అక్కడి నుండి ఆమోదం పొందిన పిల్లలకు నెలకు 2000 రూపాయలు వస్తాయని రాష్ట్ర అధికారులు చెప్పారు.



A. Rakesh

Kisan Mitra Adilabad Filed Coordinator

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment