about - దారికి నోచని ధర్మాజీపేట
ప్రభుత్వాల నిర్లక్ష్యానికి, అటవీ అధికారుల దురహంకారానికి అంధకారంగా మారిన ఆదివాసుల బ్రతుకులు. అటవీ హక్కు చట్టం 2006 ప్రకారం పట్టాలు పొందినా, ఆ పట్టా కాగితంలో ఏం రాసుందో కూడా వారికి తెలియదు.
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం బిర్సాయిపేట గ్రామ పంచాయతీ లో ఒక చిన్న గూడెం ధర్మాజీపేట. పచ్చని అడవిలో వాగులు వంకలు దాటితే ఐదు మైళ్ళ దూరంలో కొండల నడుమ అందమైన గూడెమది.
ప్రభుత్వాల నిర్లక్ష్యానికి, అటవీ అధికారుల దురహంకారానికి అంధకారంగా మారిన ఆదివాసుల బ్రతుకులు. అటవీ హక్కు చట్టం 2006 ప్రకారం పట్టాలు పొందినా, ఆ పట్టా కాగితంలో ఏం రాసుందో కూడా వారికి తెలియదు. కనీస అవసరాలైన కరెంటు, రోడ్డు, త్రాగునీరుకు కూడా ఆ గూడెంఇంకా నోచుకోలేదు. అడవిపై ఆధారపడి జీవించే ఆదివాసుల సాంప్రదాయ వ్యవసాయమే కాదు, అటవీ ఉత్పత్తుల సేకరణ కూడా ఇప్పుడు ఆగిపోయింది.సమస్యలకు నిలయంగా మారిన ఆ గూడెం మనుగడే ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది.సామాజిక తనిఖీలో అడిగిన ప్రతి ప్రశ్నకివారు చెప్పిన సమాధానం ఆవేదనతో నిండినదే. 2012 తర్వాత టైగర్ రిజర్వ్ అనే పేరుతో తమ బతుకులు గందరగోళంగా మారాయని గూడెం మొత్తం కాలి చేయించే ప్రయత్నం చేస్తున్నారని,అడవే తమ బతుకని అడవి వదిలితే మేము బతికేది ఎలా అని గూడెం వాసుల ఆవేదన.తాము గూడెం వదిలి వెళ్ళిపోయేది లేదని వాళ్లు చెప్పడం మా అందరిలో నిశ్శబ్దాన్ని నింపింది. కనీసం తమ గూడెం పేరు సూచించే సూచిక బోర్డును కూడా ఉండనివ్వకుండా అటవీ అధికారులు పలు మార్లు ధ్వంసం చేసారని వాపోయారు. ధర్మాజీపేట పై కిసాన్ మిత్ర టీం ప్రత్యేక దృష్టి సారించింది.

కిసాన్ మిత్ర రాష్ట్ర కో ఆర్డినేటర్ హర్ష నేతృత్వంలో మూడు సార్లు ఆ గూడాన్ని సందర్శించి వ్యక్తిగత పట్టా హక్కులు, సాముదాయక పట్టా హక్కులు, టైగర్ రిజర్వ్ గురించి గూడెం వాసులతో మా బృందం చర్చలు జరిపింది. దానిపై ఒక నివేదిక తయారు చేసి గ్రామ సభలో, ప్రజా వేదికలో కలెక్టర్ రాజర్షి షా గారి దృష్టికి తీసుకుపోయింది. వారు సానుకూలంగా స్పందించి అటవీ అధికారులను హెచ్చరించారు. అడవి ఆదివాసుల హక్కు అని, అడవిని సంరక్షించే బాధ్యత వారికి ఉందని, అటవీ హక్కు చట్టం 2006 తర్వాత టైగర్ రిజర్వ్ వచ్చిందని ఈ అంశం గురించి చర్చిస్తామని కలెక్టర్ గారు ఆదివాసులకు భరోసా ఇవ్వడంలో ఒక ముందడుగు పడింది.
ఈ ప్రయత్నం తరువాత కిసాన్ మిత్ర టీం ఆదివాసీలకు ఒక నమ్మకం ఇవ్వడంలో విజయం సాధించిందనే చెప్పవచ్చు. అటవీహక్కు చట్టం 2006 అమలుపై సామాజిక తనిఖీ ఆదివాసీలకు చట్టంపై అవగాహన ప్రత్యేకించి వ్యక్తిగత సామూహిక హక్కుల పై చైతన్యం కలిగించింది.ఆదివాసుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న నాయకులకు, అధికారులకు వారి బాధ్యతలను గుర్తు చేసింది.
కిసాన్ మిత్ర సాగించిన సామాజిక తనిఖీని జిల్లా కలెక్టర్ ప్రశంసించడమే కాకుండా స్థానికంగా రైతులకు ఏ సమస్య ఉన్నా కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ను సంప్రదించాలని సూచించడం కిసాన్ మిత్ర టీం చేస్తున్న కృషికి నిదర్శనం.
N. RamVilas
Counselor Mob: 7989879062
No comments yet. Login to start a new discussion Start a new discussion