about - కౌలు రైతులను గుర్తించాలని జిల్లా స్థాయి సమావేశాలు
తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఇటీవల నిర్వహించిన సర్వే లో కౌలు రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ముందుకు వచ్చాయి.
తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఇటీవల నిర్వహించిన సర్వే లో కౌలు రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ముందుకు వచ్చాయి.
ముఖ్యంగా :
- కౌలు ధరలు పెరగడం
- సబ్సిడీ ఎరువులు అంధక పోవడం
- పండిచిన పంటలు మద్దతు ధరకు అమ్ముకోక పోవడం
- పంట నష్ట పరిహారం నేరుగా కౌలు రైతుల ఖాతాలో జమ కాక పోవడం
- పంట ఋణాలు కౌలు రైతులకు అంధకపోవడం
- వడ్డీ వ్యాపారుల కి అధిక వడ్డీ లు చెల్లించి కౌలు వ్యవసాయం చేయడం
- ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ వివిధ జిల్లాలలో సమావేశాలు నిర్వహించింది.
జూలై వికారబాద్ కౌలు రైతుల జిల్లా స్థాయి సమావేశం:
ఈ సమావేశంలో 9 మండలాల నుండి కౌలు రైతులు పాల్గొన్నారు. బషీరాబాద్, తాండూరు, కోడంగల్, మోమినపేట, మర్పల్లి, పూడూరు, పెద్దేముల్, వికారాబాద్ మరియు యాలాల్ కౌలు రైతులు, అమరదికలాన్ సలావుద్దీన్ ఇబ్రహీం, మౌలానా, జీవంగీ సర్పంచ్ బాలప్ప, అంగడి రాయచూర్ ఉప సర్పంచ్ కృష్ణ శ్రీనివాస్, అల్లాపురం ఉప సర్పంచ్, గుండప్ప, జయసింగ్, సంగమేశ్వర్, బసప్ప, నర్సింలు, భారతి, సత్తార్ అజీమ్ వంటి అనేకమంది కౌలు రైతులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ రాష్ట్ర నాయకులు విస్సా కిరణ్ కుమార్, బి.కొండల్ రెడ్డి తో పాటు వి.భార్గవి, ఎస్.అనూష, మహిత, ప్రణీత హాజరు అయ్యారు. సాధన కమిటీ వికారాబాద్ జిల్లా సభ్యులు వి.అమరేశ్వర్, ఎస్.యాదయ్య, కే.కరుణానిధి తో బాటు భారతీయ కిసాన్ యూనియన్ (ఎ), న్యూ డెమొక్రసీ పార్టీ, పి.ఓ.డబల్యు జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ కౌలు రైతుల జిల్లా స్థాయి సమావేశం:
ఉమ్మడి వరంగల్ జిల్లా కౌలు రైతుల సమావేశం : జూలై 4 న జరిగిన ఈ సమావేశం లో వరంగల్ జిల్లా కు చెందిన పలువురు కౌలు రైతులు మరియు ఈ సమావేశానికి రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు విస్సా కిరణ్ కుమార్, బి. కొండల్ రెడ్డితో పాటు మనోజ్ కుమార్, విలాస్. మరియు రైతు సంఘం రాష్ట్ర ఉప అధ్యక్షులు చుంచు రాజేందర్, నాయకులు రాజయ్య మేగిలి, బాలరాజు, నాగేష్, సంపూర్ణ, సురేష్ ప్రసాద్, హంసాల్ రెడ్డి, రవీందర్, విజయ్, సుదర్శన్, సాంబయ్య, అనిత, సుధాకర్,
ఈ సమావేశంలో కౌలు రైతులు పట్టా దారు అమెరికా లో ఉంటాడు. ఆయన OTP లు చెప్పక పోవడం వలన కౌలు రైతు గా నమోదు చేసుకోలేక పోతున్నాను పట్టా దారుకు సంబంధం లేకుండా గుర్తింపు కార్డ్ ఇచ్చి ఎలాంటి ఓటీపీ గాని సంతకం గాని లేకుండా అధికారులే గుర్తించాలి. ఫసల్ భీమా గాని రైతు భీమా కానీ కౌలు సాగు చేసే వారికే వర్తించాలి అని అన్నారు.
ఆదిలాబాద్ కౌలు రైతుల జిల్లా స్థాయి సమావేశం:
జూలై 29 న జరిగిన కౌలు రైతుల సాధన కమిటీ రాష్ట్ర సమావేశంలో జిల్లా నాయకులు, కౌలు రైతులు, ప్రజా సంఘాల నాయకులు మరియు ఖానాపూర్ నియోజకవర్గ శాసన సభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ గారు, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. బోథ్, నేరడిగొండ, తలమడుగు, తాంసీ, భీంపూర్, ఆదిలాబాద్ రూరల్, బేలా, సాత్నాల, బోరజ్, గుడిహత్నూర్ నుండి కౌలు రైతులు వచ్చి తమ బాధలు చెప్పుకున్నారు.
రాష్ట్ర స్థాయి సాధన కమిటీ తరఫున తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ రాష్ట్ర నాయకులు విస్సా కిరణ్ కుమార్, బి.కొండల్ రెడ్డి, టి. శ్రీహర్ష, మనోజ్, విలాస్, మహిత, ప్రణీత హాజరు అయ్యారు. ఆదిలాబాదు జిల్లా సాధన కమిటీ తరఫున ఎం.రమాకాంత్, సంగెపు బొర్రన్న. కౌలు రైతులతో కూడిన జిల్లా కమిటీలో సభ్యులుగా ఏ.రాకేశ్, షారూఖ్, గెల్ల మల్లేష్, బింగి తిరుపతి, సాయి చైతన్య, మొండెల రాజేందర్, కట్ల కుమారస్వామి, పి.సంతోష్, టి.పోశెట్టి, రాసం నర్సింహు, కోడె ప్రమోద్. లు ఉన్నారుతెలంగాణ రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రేయ, అఖిల పక్ష రైతు సంఘం నాయకులు కొండ రమేష్, పోశెట్టి, దళిత శక్తి ప్రోగ్రామ్ (డీ.ఎస్.పీ.) రాష్ట్ర కన్వీనర్ అగ్గిమల గణేష్, జిల్లా ఎస్సీ ఎస్టీ కమిటీ మెంబర్ శశికాంత్, రైతు పోరు యాత్ర నాయకులు విద్యాసాగర్, రిటైర్డ్ వ్యవసాయ అధికారి నర్సింగరావు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాల పల్లి కౌలు రైతుల జిల్లా స్థాయి సమావేశం:
ఆగస్ట్ 4 న జరిగిన సమావేశం లో భూపాలపల్లి జిల్లాలోని అనేక మండలాలకు చెందిన కౌలు రైతులు పాల్గొన్నారు. తెలుగు దేశం పార్టీ, జిల్లా బాధ్యులు, అందె భాస్కర్ చారి, మాట్లాడుతూ, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ, అధికార ప్రతినిధి, చల్లూరి మధు, మాట్లాడుతూ, కౌలు రైతుల సమస్యలను గుర్తించి, కౌలు రైతుల గుర్తింపు కార్డులు ఇచ్చి సమస్యలు పరిస్కరించాలని అన్నారు. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కామెర గట్టన్న, మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశానికి కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ, జిల్లా కన్వీనర్ కర్నాటకపు సమ్మయ్య అద్యక్షత వహించారు. రాష్ట్ర కమిటీ నుండి విలాస్, సంజీవ్ లు పాల్గొని విజయవంతం చేశారు.
సంగారెడ్డి జిల్లా కౌలు రైతుల సమావేశం
- ఆగస్ట్ 11 న జరిగిన సమావేశంలో పాల్గొన్న 8 మండలాల కౌలు రైతులు
- అదనపు కలెక్టర్ తో వివరంగా చర్చించి వినతి పత్రం, సర్వే రిపోర్ట్ ఇచ్చిన కౌలు రైతులు
హత్నూర, మొగడంపల్లి, జహీరాబాద్, జరాసంఘం, న్యాలకల్, కొండాపూర్, సదాశివపేట మరియు సంగారెడ్డి మండలాల నుండి కౌలు రైతులు వచ్చి తమ కష్టాలను వివరించారు. కౌలు రైతులకు గుర్తింపు సాధించుకునేందుకు గట్టి పొరాటం చేయడానికి సిద్ధం అని, హైదరాబాద్ స్థాయిలో కౌలు రైతుల గర్జన లో పెద్ద ఎత్తున పాల్గొంటామని ప్రకటించారు.
మాట్లాడిన కౌలు రైతులు: జరాసంఘం మండలం నుండి మొగులమ్మ, జహీరాబాద్ మండలం నుండి చాంద్ బాయి, న్యాలకల్ మండలం నుండి సూర్యకళ, శకుంతల, హాత్నూర మండలం నుండి సువర్ణ, నాగరాజు.
మాట్లాడిన కౌలు రైతు ఆత్మహత్య కుటుంబాలు: కోహిర్ మండలం మాచారెడ్డిపల్లి నుండి సావిత్రమ్మ, మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ నుండి కురువ మమత, కొండాపూర్ మండలం గంగారం కుమ్మరి యాదగిరి, సదాశివపేట నుండి సూర్యప్రభ.
రాష్ట్ర స్థాయి సాధన కమిటీ తరఫున తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ నాయకులు బి.కొండల్ రెడ్డి, కన్నెగంటి రవి, విస్సా కిరణ్ కుమార్, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర నాయకులు పి. శంకర్ పాల్గొన్నారు. టిపిజెఎసి జిల్లా కన్వీనర్ వై. అశోక్ కుమార్, రైతు సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షులు రంగా గౌడ్, మంజీర రైతు సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్ పాల్గొని కౌలు రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. సంగారెడ్డి సాధన కమిటీ తరఫున ఆర్. లక్ష్మి తో బాటు బి.చుక్కమ్మ, ఎం. విక్రమ్, మానస పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా కౌలు రైతుల సమావేశం:
ఆగస్ట్ 13 న జరిగిన సమావేశంలో పాల్గొన్న సారంగాపూర్, దిలావర్ పూర్, సోన్,నిర్మల్ మండలాల కౌలు రైతులు, సాధన కమిటీ నాయకులు, రైతు సంఘాలు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం విజయవంతంగా జరిగింది.
సమావేశం నిర్మల్ జిల్లా కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో జరిగినది; కమిటీ సభ్యులు సంగేపుబోర్రన్న అధ్యక్షత వహించారు. వివిధ మండలాల నుండి కౌలు రైతులు వచ్చికౌలు రైతులకు గుర్తింపు సాధించుకునేందుకు గట్టి పోరాటంచేయడానికి సిద్ధం అని, హైదరాబాద్ సెప్టెంబర్ లో జరిగే కౌలు రైతుల గర్జన లో పెద్ద ఎత్తున పాల్గొంటామని ప్రకటించారు.
మాట్లాడిన కౌలు రైతులు: పున్నసాయేందర్, పి . ప్రశాంత్, శివాకర్, మనోజ్ కుమార్
రాష్ట్ర స్థాయి సాధన కమిటీ తరఫున తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ రాష్ట్ర నాయకులు కన్నెగంటి రవి, విలాస్పాల్గొన్నారు.
నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, తెలంగాణ జన సమితి నాయకులు వాజిద్ అహ్మద్ ఖాన్, CPI జిల్లా నాయకులు S.n రెడ్డి, నిర్మల్ జిల్లా కిసాన్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అట్ల పోతారెడ్డి, ప్రవాసి మిత్ర కార్మిక సంఘం నాయకులు స్వదేశ్పరికపండ్ల, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాధన కమిటీ తరఫున రమాకాంత్, రాకేష్, షారూక్, వినోద్ పాల్గొన్నారు.
మెదక్ కౌలు రైతుల జిల్లా స్థాయి సమావేశం:
ఆగస్ట్ 18 న జరిగిన ఈ సమావేశంలో మెదక్, హవేలీ ఘనపూర్, పాపన్న పేట, శివం పేట, నిజాం పేట, హథ్నూర, మండలాల కౌలు రైతులు పాల్గొన్నారు. కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ రాష్ట్ర, జిల్లా నాయకులు అనేక మంది సమావేశానికి హాజరయ్యారు.సమావేశంలో మాట్లాడినకౌలు రైతులు భాగ్య, మమత, శామ్యూల్, ఎన్.నాగరాజు.
రాష్ట్ర స్థాయి సాధన కమిటీ తరఫున తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ రాష్ట్ర నాయకులు కన్నెగంటి రవి, బి. కొండల్, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ నాయకులు పి.శంకర్, TPJAC రాష్ట్ర నాయకులు బి. కొండల్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ నాయకులు ఆర్.లక్ష్మీ, నిర్మల్ జిల్లా రైతు స్వరాజ్య వేదిక నాయకులు మనోజ్ కుమార్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కే.మల్లేశం, సత్య శోధన మండలి నాయకులు విక్రమ్,శివాజీ సమావేశం లో మాట్లాడారు.

Jadi. Vilas
Jadi. Vilas Associate farmer Distress Support Mob: 9515197546
No comments yet. Login to start a new discussion Start a new discussion