about - కిసాన్ మిత్ర కృషితో బ్యాంక్ అకౌంట్ హోల్డ్ లో ఉన్న రైతు సమస్య పరిష్కారం
డాక్యుమెంట్ లు పూర్తిగా సబ్మిట్ చేసిన తర్వాత ఆయన బ్యాంకు అకౌంటు హోల్డ్ చేశారు.వారం రోజుల తర్వాత తాండూర్ HDFC బ్యాంకు నుండీ కొంత అమౌంట్ తీసుకుందామని వెళ్లడంతో ఈ సమస్య బయటపడింది.
వికారాబాద్ జిల్లా, ధరూర్ మండలం, ధర్మాపూర్ గ్రామానికి చెందిన పట్లోళ్ల శ్రీనివాస్ రెడ్డి సమస్య ఇది.
ఈ రైతు జూన్ 16 న పిఎసిఎస్ ధరూర్ జొన్నల కొనుగోలు కేంద్రం, మున్నూరు సోమారం రైతు వేదిక లో ప్రభుత్వానికి జొన్నలు అమ్మాడు. . కాటా వేసిన తర్వాత సెంటర్ ఇంచార్జికి తన బ్యాంకు ఎకౌంటు, ఆధార్, పట్టాదారు పాస్ బుక్ ఇచ్చారు.
డాక్యుమెంట్ లు పూర్తిగా సబ్మిట్ చేసిన తర్వాత ఆయన బ్యాంకు అకౌంటు హోల్డ్ చేశారు.వారం రోజుల తర్వాత తాండూర్ HDFC బ్యాంకు నుండీ కొంత అమౌంట్ తీసుకుందామని వెళ్లడంతో ఈ సమస్య బయటపడింది.
గతంలో ఎప్పుడూ ఎటువంటి ప్రాబ్లం రాలేదు మా అకౌంటు హోల్డ్ లో పెట్టడం ఏంటని మేనేజర్ ను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. బ్యాంకులోకి రైతు భరోసా డబ్బులు వచ్చి రిటర్న్ వెళ్ళిపోయాయని మేనేజర్ చెప్పారు. మా అకౌంట్ కు డబ్బులు వచ్చి ఎలా వెళ్ళిపోతాయని మేనేజర్ ను నిలదీయడంతో, సంవత్సరములో 12 లక్షల కన్నా ఎక్కువగా బ్యాంకులో డబ్బులు వేయడం, తీయడం జరిగిందని అందుకని మీ అకౌంటును హోల్డ్ లో పెట్టారని చెప్పారు.
మేము రైతులము, మేము బిజినెస్ చేయడం లేదు, మీరు కావాలంటే అకౌంట్ చెక్ చేసుకోండి, మాకు వచ్చేది ప్రభుత్వపరంగా మద్దతు ధరకు అమ్మిన పంటల అమౌంట్ మా అకౌంట్లో వేశారు కావాలంటే మీరు బ్యాంకు స్టేట్మెంట్లు తీసి చూడండి అని రైతు శ్రీనివాస రెడ్డి గారు ఎన్ని రోజులలో లేనటువంటి సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని మేనేజర్ ని గట్టిగా నిలదీయడంతో వారు ఆధార్ ని పాన్ కార్డుకు ఉన్న పేరు సరి చేసుకోమని సూచించాడు.
జొన్నలు అమ్మిన డబ్బులు ఈ అకౌంట్ కు వస్తాయా లేదో అని కిసాన్ మిత్రకు ఆ రైతు ఫోన్ చేశారు. జొన్నలు అమ్మిన డబ్బు ఆ రైతుకు సుమారుగా ఏడు లక్షలు వరకు రావలసి ఉంది. కిసాన్ మిత్ర బృందం రైతుతో కలసి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ తో చర్చించారు. మళ్లీ డాక్యుమెంట్లు అన్నీ తీసుకొని అకౌంట్ డీటైల్స్ సరి చేశారు. రైతులకు పంట అమ్మిన డబ్బులు అకౌంట్ లో పడ్డాయి.
J. Narsimhulu
Kisan MItra Vikarabad Field Coordinator
No comments yet. Login to start a new discussion Start a new discussion