about - ఆదివాసీ రైతులకు పంట రుణాలు రావడం లేదు
భద్రాచలం ఐటీడీఏ పీఓ ఆఫీసులో సెక్షన్ ఆఫీసర్ గారితో మాట్లాడినప్పుడు, అటవీ హక్కు పత్రం లేని వారికి ఒక ధృవీకరణ పత్రం మంజూరు చేస్తే ఆ రైతులు బ్యాంకు నుంచి పంట రుణాలు పొందుతున్నారని చెప్పారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం రంజీగూడ గ్రామం రైతుఆత్రం మోతిరం కు అటవి హక్కు పట్టా రాలేదు. ఈ సమస్య పై కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు ఆయన ఫిర్యాదు చేశారు.
కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనకు అటవీ హక్కు పత్రం మంజురు కాలేదు. ఆయనకురాష్ట్ర ప్రభుత్వ రైతు భరోసా పథకం నుంచి పెట్టుబడి సహాయం అందుతున్నది. కానీ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఉట్నూర్ బ్రాంచ్ వాళ్ళు ఆయనకు పంట రుణం ఇవ్వడం లేదని దృష్టికి తెచ్చారు. ఈ సమస్యపై బ్యాంకు మేనేజర్ గారితో కూడా మా బృందం ముఖాముఖి చర్చించింది. అటవీ హక్కు పత్రం ఉంటేనే పంట రుణం ఇస్తామని బ్యాంక్ మేనేజర్ స్పష్టం చేశారు.
ఈ సమస్యపై ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గారికిఫిర్యాదు చేశాం. రైతు సమస్యను పీఓ గారు విని, బ్యాంకు అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కిసాన్ మిత్ర ప్రతినిధిగా నేను మాట్లాడాను. రైతుకి కూడా తన సమస్య చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చారు.ITDA తరపునబ్యాంకు వారికి లెటర్ రాసి పంపుతామని హామీ ఇచ్చారు. హక్కు పత్రాలు ఉన్న వారందరికీ పంట రుణాలు ఇవ్వాలనిఆదేశించారు.
కానీ బ్యాంక్ కువెళ్లిన తరువాత అధికారులు RBI మార్గదర్శకాల ప్రకారం భూమిపై పట్టా హక్కులు లేని వారికి పంట రుణాలు ఇవ్వరాదని LDM నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయనిఅన్నారు. ఈ సమస్యపై CM ప్రజావాణిలో కూడా దరఖాస్తు చేశాం. ఐటీడీఏ పీఓ గారితో కూడా మళ్ళీ చర్చలు జరిపాం.
భద్రాచలం ఐటీడీఏ పీఓ ఆఫీసులో సెక్షన్ ఆఫీసర్ గారితో మాట్లాడినప్పుడు, అటవీ హక్కు పత్రం లేని వారికి ఒక ధృవీకరణ పత్రం మంజూరు చేస్తే ఆ రైతులు బ్యాంకు నుంచి పంట రుణాలు పొందుతున్నారని చెప్పారు. ఉట్నూర్ ITDA పీఓ గారు కూడా రైతులకు అలాంటి ధృవీకరణ పత్రం ఇవ్వడానికి అంగీకరించారు.
కానీ, ఉట్నూర్ ROFR సెక్షన్ అధికారులుధృవీకరణ పత్రం మంజూరు చేయవద్దని పీఓ గారికి చెప్పారు. ఈ ధృవీకరణ పత్రాలను నకిలీ పత్రాలు గా సృష్టించే అవకాశాలు ఉనాయని కారణం చెబుతూ, పీఓ గారు కూడా ధృవీకరణ పత్రాలు ఇవ్వడానికి అంగీకరించలేదు.
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ గారికి అటవి హక్కు పత్రాలు లేని వారికి కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని, వారికి కూడా పంట రుణాలు అందించడానికిఅనుమతి కావాలని కోరుతూ, లెటర్ రాశారు. ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో పెండింగ్ లో ఉంది .

Kumra. Vinayak Rao
Kisan Mitra Adilabad Field Coordinator, 94937 76805
No comments yet. Login to start a new discussion Start a new discussion