about - ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్తి మార్కెట్
గత 7 ఏళ్లుగా కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్ ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎదుర్కొనే అనేక సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తోంది. ఈ క్రమంలో పత్తి మార్కెట్‌లో వచ్చే అనేక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నాము.
రైతులు పంటను పండించడం ఒక ఎత్తయితే, ఆ పంటను కనీస మద్దతు ధర (MSP) కు అమ్ముకోవడం మరొక ఎత్తు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట ప్రధానమైన పంటలలో ఒకటి, మరియు పత్తి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా కీలక స్థానంలో ఉంది.
గత 7 ఏళ్లుగా కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్ ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎదుర్కొనే అనేక సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తోంది. ఈ క్రమంలో పత్తి మార్కెట్‌లో వచ్చే అనేక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశాము.
హెల్ప్‌లైన్‌కు వచ్చిన ప్రధాన సమస్యలు
➢ జిన్నింగ్ మిల్లులలో తేమ శాతం (Moisture Percentage) రీడింగ్ లో తేడాలు ఉండడం
➢ తేమ ఎక్కువగా ఉందని చెప్పి పంటను రిజెక్ట్ చేయడం లేదా బిల్‌లో తేమ శాతం ఎక్కువగా నమోదు చేయడం
➢ క్వాలిటీ/రంగు (Color) సరిగా లేదని చెప్పి పత్తిని రిజెక్ట్ చేయడం లేదా తక్కువ ధరకు కొనుగోలు చేయడం
➢ భూమి ఉండి పట్టా లేని వారు పంట అమ్ముకోడానికి కల్టివేషన్ సర్టిఫికెట్ తెచ్చుకోవడంలో ఇబ్బంది పడడం
➢ క్రాప్ బుకింగ్ సమయంలో పంట వివరాలు నమోదు కాకపోవడం లేదా తక్కువ భూమి నమోదు కావడం
➢ కౌలు రైతుల తత్కాల్ రిజిస్ట్రేషన్ ఆలస్యం కావడం
➢ కౌలు రైతులకు LEC కార్డ్‌లు లేకపోవడం వలన నేరుగా పంట అమ్మడంలో సమస్యలు
➢ మార్కెట్ లో పంట అమ్ముకోడానికి ఎక్కువ రోజుల పట్టడం
➢ మార్కెట్‌లో కనీస సౌకర్యాలు లేకపోవడం
➢ వర్షాల కారణంగా పంట తడిచి పోవడం
➢ జిన్నింగ్ మిల్ వారు పత్తి లో కట్టింగ్స్ చెయ్యడం
➢ మార్కెట్ తొందరగా ఓపెన్ చెయ్యమని రైతులు అడగడం
➢ పంట అమ్మిన తర్వాత డబ్బులు ఆలస్యంగా పడడం
కిసాన్ మిత్ర పని విధానం :
- ప్రతి ఫీల్డ్ కోఆర్డినేటర్ తరచుగా మార్కెట్‌లు, జిన్నింగ్ మిల్లులకు వెళ్లి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు.
- హెల్ప్ లైను కి వచ్చిన సమస్యలు వెంటనే ఫాలో అప్ చేస్తారు.
- సమస్యలను స్థానిక అధికారులతో కలిసి పరిష్కరించడానికి కృషి చేస్తారు.
- మార్కెట్‌కు సంబంధించిన జిల్లా స్థాయి మీటింగ్‌లలో పాల్గొంటారు.
- రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళతారు.
- ఆదివాసీ రైతులు తమ పత్తిని CCI (Cotton Corporation of India) వారికి అమ్ముకునేలా అవగాహన కల్పిస్తారు.
ప్రస్తుతం మార్కెట్‌లో ప్రధాన మార్పు – కపాస్ కిసాన్ యాప్
పత్తి ధర దేశ, విదేశాల మార్కెట్‌పై ఆధారపడి ప్రతిరోజూ మారుతున్న, ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్ ధర తక్కువగా ఉండటం వల్ల రైతులు సీసీఐ (CCI) కి అమ్మడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ దళారులను, మధ్య వర్తులను అరికట్టి రైతులకు లాభం చేకూర్చడమే లక్ష్యంగా ఉందని చెబుతోంది. కానీ రైతుల్లో దీనిపై అవగాహన లోపం, సందేహాలు ఎక్కువగా ఉండటం వల్ల కొంత భయం, ఆందోళన కనిపిస్తోంది.
కిసాన్ మిత్రగా మేము ఈ కొత్త సిస్టమ్ వల్ల రైతులకు ఎదురయ్యే సమస్యలను గుర్తించి, సంబంధిత అధికారులతో కలిసి తక్షణ పరిష్కారం కోసం సహాయం అందిస్తున్నాము.
కపాస్ కిసాన్ యాప్ ముఖ్యాంశాలు
➢ రైతులు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మాత్రమే పత్తిని మార్కెట్‌లో అమ్మగలరు.
➢ రైతు వద్ద ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి.
➢ క్రాప్ బుకింగ్ చేసిన రైతులకు మళ్లీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
➢ కౌలు రైతుల కోసం ప్రత్యేక ఆప్షన్ ఉంది. కౌలు రైతులను నమోదు చేసిన తర్వాత వ్యవసాయ అధికారులు ధృవీకరించిన తర్వాతే వారు పత్తిని అమ్మగలరు.
➢ రిమోట్ ప్రాంతాలలో AEO లు రైతువేదికలలో కూర్చొని రైతులకి స్లాట్ బుక్ చేస్తారు
➢ ప్రతి AMC పరిధిలో LMC (లోకల్ మోనిటరింగ్ కమిటీ) ఏర్పాటు చెయ్యబడుతుంది, ఇందులో స్థానిక తహసీల్దార్, SHM (Police), మండల వ్యవసాయ అధికారి, AMC సెక్రటరీ, CPO (CCI), రైతు ప్రతినిధులు Farmer Representative లు ఉండవచ్చు.

రైతు సోదరులు కింద ఇచ్చిన గూగుల్ ప్లేస్టోర్ లింక్ ద్వారా కపాస్ కిసాన్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకొని కనీస మద్దతు ధరకు పత్తిని అమ్మగలరు.
https://play.google.com/store/apps/details?id=com.cotcorp.kapaskisan
➢ రైతు స్లాట్ బుక్ చేసిన తేదీన మార్కెట్‌కు వెళ్లలేకపోతే స్లాట్‌ను రద్దు చేసుకునే అవకాశం ఉంది.
➢ రైతులు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఏదైనా కారణాల చేత రైతు మార్కెట్ కి వెళ్లలేనప్పుడు క్యాన్సిల్ చేసుకోకపోతే ఆటోమేటిక్ గా దిగుబడి పరిమితి తగ్గడం జరుగుతుంది
➢ ఈ సిస్టమ్‌లో AEO ల పాత్ర చాలా కీలకం.
ధరల పరిస్థితి
మద్దతు ధర - గత సంవత్సరం కంటే 589 రూపాయలు పెరిగి 8,110 రూపాయలయింది
ప్రైవేటు ధర - ప్రస్తుతం 6,500-7,000రూపాయలు ఉంది. ఇది ప్రతిరోజూ మారుతూ ఉంటుంది.
సంక్షిప్తం
పత్తి రైతుల సమస్యలు చాలా క్లిష్టమైనవిగా ఉన్నప్పటికీ, కిసాన్ మిత్ర టీమ్ రైతుల సమస్యలను గుర్తించి, ప్రభుత్వ అధికారులతో కలిసి పరిష్కారానికి కృషి చేస్తోంది. కొత్త కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతుల సమస్యలు తగ్గాలని, పత్తి మార్కెట్ మరింత పారదర్శకంగా మారాలని ఆశిస్తున్నాము.
SRD. Anusha
Kisanmitra Coordinator 7997847555
No comments yet. Login to start a new discussion Start a new discussion