about - ఆదిలాబాద్ జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.
కౌలు రైతులు సాగులో నిత్యం ఆటంకాలు ఎదుర్కుంటూ కూడా పంటలు పండిస్తున్న దృశ్యాలు ఆదిలాబాద్ జిల్లా నలు మూలలా గ్రామాలలో కనిపిస్తున్నాయి.
2011 భూ అధీకృత సాగు దారుల చట్టం ప్రకారం కౌలు రైతులకు రుణ అర్హత గుర్తింపు కార్డులు ఇస్తే వారికి కూడాపంట నష్టపోతే పరిహారం వచ్చే అవకాశంఉంది. ఈ కౌలు రైతులలో రెండు రకాల వాళ్ళున్నారు. కొందరికి కొంత సాగు భూమి ఉంది. అసలు భూమిలేని కౌలు రైతులు కూడా ఉన్నారు.
సొంత భూమి లేదు అనే కారణంగా బ్యాంక్ అధికారులు కౌలు రైతులకు పంటరుణాలు ఇవ్వడం లేదు. వీళ్ళు తమ జీవనం కొనసాగించాలంటే కౌలు వ్యవసాయం చేయక తప్పడం లేదు. అందువల్లనే అప్పో సప్పో చేసి భూమి కౌలుకు తీసుకుని పంటలు వేస్తున్నారు.
కౌలు రైతులు సాగులో నిత్యం ఆటంకాలు ఎదుర్కుంటూకూడా పంటలు పండిస్తున్న దృశ్యాలు ఆదిలాబాద్ జిల్లా నలు మూలలా గ్రామాలలో కనిపిస్తున్నాయి. సరైన పంట దిగుబడి రాక కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. ఈ కారణం చేతనే ఆదిలాబాద్ జిల్లాలో అనేక మంది కౌలు రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు.
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల పంట నష్ట పోయిన సమయంలో ప్రభుత్వం నుండి ఎలాంటి నష్ట పరిహారం అందడం లేదు. పట్టా భూమి ఉన్న రైతులకు మాత్రమే బ్యాంకులు,రాష్ట్ర ప్రభుత్వం అందించే పంట రుణాలు, పంట రుణమాఫీ, రైతు భరోసా పథకాలుఅమలవుతున్నాయి.
ఈనేపధ్యంలో కౌలు రైతులు కోలుకునేలా సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి. పెట్టుబడి సాయంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం కూడాకౌలు రైతులకు అమలు చేయాలి. గ్రామాలవారీగా కౌలు రైతులను గుర్తించాలి

కొలాం ఆదివాసీ రైతులకు పంట రుణాలు ఇవ్వాలి
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని బూతాయి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కొలంగూడా లో దాదాపు 70 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామంలో 278 మంది ఆదివాసీలు నివాసం ఉంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర గత ప్రభుత్వంఆదివాసీ కొలాం తెగకు చెందిన 25 కుటుంబాలకుఅటవీ హక్కు పత్రాలు అందించింది. భూమిపైహక్కు పత్రాలు ఉన్న ఈ కుటుంబాలకుస్థానికంగా ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ఇప్పటికీ పంట రుణాలు ఇవ్వడం లేదు.
కొలంగూడ కు చెందిన సిడాం నాగో రావ్ తో కలిసి వెళ్ళి తెలంగాణా గ్రామీణ బ్యాంకుమేనేజర్ తో రైతులకు పంట రుణాలు ఇవ్వాలని చర్చించాం.
ఉట్నూర్ ఐటీడీఏ పిఓ గారిని కలిసి చర్చించాలని, ఆదివాసీ రైతులకు పంట రుణాలు ఇచ్చేలాప్రభుత్వం నుండి ఏదైనా జీవోఉన్నట్లయితే రైతులకు పంట రుణాలు ఇవ్వడానికి తమకు అభ్యంతరంలేదని బ్యాంకు అధికారులు సూచించారు.
అటవీ హక్కులు పొందిన ఆదివాసీ రైతులకు పంట రుణాలు ఇవ్వడం కుదరదని బ్యాంకు అధికారుల దగ్గర ఏదైనా సర్కులర్ ఉంటేచూపించాలని మేము అడిగాము. అలాంటి సర్కులర్ ఏదీ తమ దగ్గర లేదని అధికారులు చెప్పారు.
అటవి హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం రైతులకు అటవీ హక్కు పత్రాలు ఇవ్వడమంటే, అటవీ భూములపై వారి హక్కులను గుర్తించడమే. భూమి సాగుతో పాటు, మెరుగైన ఆదాయం కోసం అడవిలో దొరికే పండ్లు ఫలాలు, ఇతరత్రా ఆహారం సేకరించుకోవడానికి వారికి అధికారం ఉంటుంది. ఈ చట్టం ద్వారా ఈ కుటుంబాలకు వ్యక్తి గత పట్టా హక్కులు, కమ్యూనిటీ అటవీ హక్కు పత్రాలు కూడా ఇచ్చారు. కానీ, ఈ కుటుంబాలకు పంట రుణాలు అందడం లేదు.
Sangapu. Borranna
8106318135
No comments yet. Login to start a new discussion Start a new discussion