about - 5 సంవత్సరాల భూ సమస్యకు ముగింపు కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్‌తో రైతుకు న్యాయం

రెవెన్యూ వాళ్ళు అలానే RDO కి పంపించారు. RDO section లో చాలా ఫాలోఅప్ చేశాం. సెక్షన్ లో ఎన్ని సార్లు కలిసినా వాళ్ళు ఫైల్ ను పైకి పంపించలేదు ఒక సమయం లో ఫైల్ పోయిందని కూడా చెప్పారు.

 · 3 min read

ఈ రైతు పేరు గెడాం దావు , తండ్రి పేరు సుధాం , కూర గ్రామం, జైనథ్ మండలం.గెడాం దావు  తండ్రి సుధాం పేరు మీద 3 ఎకరాల 10 గుంటల భూమి ఉండేది.  సుధాం 2021 లో చనిపోయారు. తండ్రి చనిపోయిన తర్వాత వారసత్వంగా భూమి కొడుకు ధావు కి పట్టా కావాలి.కానీ ఈ భూమి రెవెన్యూ రికార్డులలో నిషేధిత జాబితా లోకి వెళ్ళింది . దావు పట్టా కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగారు.  అధికారులు ఈ సమస్య పరిష్కరించడానికి ధరణి లో ఆప్షన్ లేదని చెప్పి పంపించారు. మళ్ళీ మళ్ళీ తిరిగినా  పట్టా కాలేదు .ఆదిలాబాద్ జిల్లాలో పైలెట్ ప్రజావాణి కార్యక్రమం మొదలయిన తర్వాత అందులో గ్రీవెన్స్ పెట్టాము. అప్పటి నుండి MRO గారితో ఫాలోఅప్ చేసినప్పుడు ఇది సీలింగ్ పట్టా  (ప్రభుత్వ భూమి),  కానీ పట్టాపాస్ బుక్ లో పట్టా భూమి అని పడింది.  అందువల్ల పట్టేదారు  చనిపోయిన తరువాత నిషేధిత జాబితాలో కి వెళ్ళిందన్నారు. మొదటి పబ్లిక్ హియరింగ్ రోజు RDO గారు కూడా వచ్చారు. ఈ కేసు పరిష్కారం కోసం  TM 33 లో అప్లికేషన్ చేసుకోమని చెప్పారు.కానీ బాధిత కుటుంబం TM 15 లో  దరఖాస్తు పెట్టారు.  రెవెన్యూ వాళ్ళు  అలానే RDO కి పంపించారు.  RDO section లో చాలా ఫాలోఅప్ చేశాం. సెక్షన్ లో ఎన్ని సార్లు కలిసినా వాళ్ళు ఫైల్ ను పైకి పంపించలేదు  ఒక సమయం లో ఫైల్  పోయిందనికూడా చెప్పారు.  మళ్ళీ ఒక రోజు వెళ్ళి ఫైల్  వెతికించాము.ఫైల్ ఆఫీస్ లోనే  దొరికింది. తరువాత రోజు JC కి పంపించారు. కలెక్టరేట్ సెక్షన్ లో ఫాలో అప్ చేసినప్పుడు,  తప్పుగా అప్లికేషన్ పెట్టారు,  ఇందులో POB నుండి రిమూవ్ చేయరాదు ,TM 33 లోనే అప్లికేషన్ పెట్టుకోవాలి ,ఈ పైల్ ను రిజెక్ట్ చేస్తూ,  కలెక్టర్ కి పంపిస్తానన్నారు.ఇలా ఫైల్ రిజెక్ట్ అయిన తర్వాత జిల్లా ధరణి ఆపరేటర్ గారిని కలిసి POB నుండి రిమూవ్ కావాలంటే ఎలా అప్లికేషన్ చేయాలి ?  అని అడిగాను. ఇప్పుడు  భూ భారతి ప్రోగ్రామ్ నడుస్తుంది కాబట్టి MRO లాగిన్ నుండే అప్లికేషన్ పెట్టమని చెప్పండి అన్నారు. మళ్ళీ MRO కార్యాలయానికి వెళ్ళి,  మీ లాగిన్ నుండే భూ భారతి లో అప్లికేషన్ పెట్టమన్నారు అని చెప్పాను. MRO గారు ధరణి ఆపరేటర్ కి చెప్పి వాళ్ళ లాగిన్ నుండి అప్లికేషన్ చేయించారు. కానీ  ఈ అప్లికేషన్ ను RDO section లో  మళ్ళీ చాలా రోజులు పెండింగ్ పెట్టారు. కలెక్టర్ గారు అప్పీల్స్ చూస్తున్నారు అని డేట్ ఇచ్చారు. నేను వెళ్ళి RDO section లో DT కి  చెప్పాను పైలెట్ ప్రజావాణి కేసుల మీద అప్పీల్ చేస్తున్నారు , మీ దగ్గరే చాలా రోజుల నుండి పెండింగ్ ఉంది అని చెప్పాను.

అ DT  వెంటనే  RDO కు ఫైల్పంపించారు. కానీ అప్పీల్  రోజుకి ఈ ఫైల్  ఇంకా RDO దగ్గరే పెండింగ్ లో ఉంది. MRO office నుండి RDO office కి పంపిన రిసీవ్డ్ కాపీ అప్పీల్ రోజు ఫైల్ ఇంకా RDO దగ్గరే పెండింగ్ ఉంది అని కలెక్టర్ గారికి చూపించాయి. కలెక్టర్, MRO ను పిలిచి ఈ  ఫైల్ లోలో భూ భారతి అప్లికేషన్ నంబర్ లేదు, ఇలానే పంపిస్తారా అని అడిగారు. మళ్ళీ వేరే అప్లికేషన్ పెట్టమన్నారు. మళ్ళీ MRO లాగిన్ నుండే భూ భారతి లో అప్లికేషన్ నంబర్ తో ఆన్లైన్ చేశారు. ఈ కాపీని ఫిజికల్ గా RDO section కి పంపించారు.మళ్ళీ దీని గురించి RDO section లో చాలా ఫాలోఅప్ చేశాను. మళ్ళీ JC, తరువాత  కలెక్టర్ లాగిన్ కి వెళ్ళిన తరువాత జిల్లా ధరణి ఆపరేటర్ తో కూడా ఫాలో  అప్ చేశాను. అప్పుడు నిషేధిత జాబితా నుండి పట్టా నుండి  సీలింగ్ రిమూవ్ అయిందికాబట్టి విరాసత్ చేసుకోమని దావు కి చెప్పాను. కుటుంబ సభ్యులు విరసత్ చేసుకోవడానికి మీసేవ కి వెళ్ళారు. అక్కడ అప్లికేషన్ చేసినప్పుడు భూ భారతి అప్లికేషన్ పెండింగ్ ఉంది అని చూపిస్తుంది. విరాసత్ చేయరాదు అని మీసేవ వారు చెప్పారు అని నాకు ఫోన్ చేసి చెప్పారు. మళ్ళీ MRO  దగ్గరికి వెళ్ళి వారి లాగిన్ లో చూశాము. అలానే పెండింగ్ చూపిస్తుంది. అప్పుడు MRO ఈ భూ భారతి అప్లికేషన్ రిజెక్ట్ కోసం మళ్ళీ RDO కి లెటర్ రాయాలి అని చెప్పారు. ఎందుకంటే గ్రామాల్లో భూ భారతి అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఈ కుటుంబ సభ్యులు  అప్లికేషన్ పెట్టుకున్నారు. మేము ప్రపోజల్ ఇంతకు ముందే పంపించాము అన్నారు. మళ్ళీ ఈ ఫైల్  రిజెక్ట్ కోసం పెట్టారు. వెంటనే ఫైల్ కూడా RDO section కి పంపించారు. మళ్ళీ RDO section లో దాదాపు ఒక రెండు నెలలు పెండింగ్ ఉండెను. రెగ్యులర్ గా సెక్షన్ లో ఫాలోఅప్ చేయడం వల్ల ఫైల్  JC లాగిన్ కి పంపించారు. కలెక్టరేట్ D section లో కూడా రెండు మూడు సార్లు ఫాలో  అప్ చేయవలసి వచ్చింది.చివరికి JC ,కలెక్టర్ లాగిన్ కి వెళ్ళిన తర్వాత జిల్లా ధరణి ఆపరేటర్ తో రెగ్యులర్ పాలోఅప్ తో  ఆ ఫైల్ రిజెక్ట్ అయింది. మళ్ళీ విరాసత్ కోసం మీ సేవ లో కుటుంబ సభ్యులు అప్లికేషన్ చేసుకున్నారు.ఇటీవల వారికి పట్టా పాస్ బుక్ అందింది.



A. Rakesh

Kisan Mitra Adilabad Filed Coordinator

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment