about - జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS): ఆవశ్యకత, అమలు తీరు

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS): ఆవశ్యకత, అమలు తీరు

 · 2 min read

భారతదేశంలో పేద కుటుంబాలకు అత్యవసర సమయంలో భరోసా కల్పించేందుకు అమలు చేస్తున్న పథకాలలో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (National Family Benefit Scheme – NFBS) ఒక ముఖ్యమైన పథకం. కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆకస్మిక మరణం చెందితే, ఆ కుటుంబానికి తక్షణ సాయంగా ₹20,000 రూపాయలు ఒకేసారి చెల్లింపు ఈ పథకంలోని ప్రధాన ఉద్దేశ్యం.

అయితే, గత దశాబ్ద కాలంగా ఈ పథకంలో ఎటువంటి పెంపు జరగకపోవడంతో పాటు, అనేక రాష్ట్రాలలో దీనిని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుత స్థితి

లబ్ధి మొత్తం: ఇప్పటికీ ₹20,000 మాత్రమే ఉంది

అర్హత: దారిద్రరేఖకు దిగువ నున్న కుటుంబం; 19 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల సంపాదించే వ్యక్తి మరణిస్తే లబ్ధి


అవసరమైన డాక్యుమెంట్స్:

  1. మరణించిన వ్యక్తి ఆధార్ కార్డు
  2. దరఖాస్తు చేసుకునే వ్యక్తి ఆధార్ కార్డు
  3. చనిపోయిన వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రము
  4. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్
  5. బ్యాంక్ అకౌంట్ జిరాక్స్

ఈ  పథకానికి దరఖాస్తు విధానంలో పైన ఇచ్చిన డాక్యుమెంట్స్ మరియు NFBS   దరఖాస్తు ఫామ్ ను స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో అందజేయాలి.


సీలింగ్ పరిమితి: ప్రతి రాష్ట్రానికి జనాభా, పేదరికం ఆధారంగా ప్రతి సంవత్సరం లబ్ధిదారుల పరిమితి నిర్ణయించబడుతుంది. ఉదాహరణకు, తెలంగాణకు సంవత్సరానికి 7,794 లబ్ధిదారుల సీలింగ్ ఉంది.


రాష్ట్రాల వ్యత్యాసాలు: కొన్ని రాష్ట్రాలు అదనపు నిధులు కలిపి ₹30,000 వరకు ఇస్తుండగా (ఉత్తర ప్రదేశ్ లో 30,000 ఇస్తున్నారు ) మరి కొన్ని రాష్ట్రాలు పూర్తిగా విస్మరిస్తున్నాయి.


అమలులో ఉన్న సమస్యలు

లబ్ధి మొత్తం పెరగలేదు: ద్రవ్యోల్బణం దృష్ట్యా ₹20,000 చాలా తక్కువ

దరఖాస్తు గడువు: కొన్ని రాష్ట్రాలు ఒక సంవత్సరం లోపే దరఖాస్తు చేసుకోవాలని నిర్దేశించాయి. డెత్ సర్టిఫికెట్ ఆలస్యం కారణంగా చాలా కుటుంబాలు లబ్ధి కోల్పోతున్నాయి.

లింగ వివక్ష: కొన్ని చోట్ల పురుషుడు చనిపోతే మహిళకు లభిస్తుంటే, మహిళ చనిపోతే పురుషునికి ఇవ్వడం లేదు

జీరో అమలు: పలు రాష్ట్రాల్లో చాలా సంవత్సరాలపాటు  లబ్ధిదారులు నమోదు కాలేదు.


విజయవంతమైన ఉదాహరణ – యాదాద్రి భువనగిరి

తెలంగాణలో రైతు బీమా పథకం ప్రారంభమైన తర్వాత NFBS పథకం అమలు దాదాపు మర్చిపోయారు. దీని వల్ల భూమి లేని కూలీలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు.

  SERP CEO శ్రీమతి దివ్య దేవరాజన్ గారి చొరవతో, యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారులు, ఎన్జీవోలు కలిసి ప్రత్యేక కృషి చేశారు.

తుర్కపల్లి మండలంలో రైతు స్వరాజ్య వేదిక ఎనిమిది సంవత్సరాలుగా లబ్ధి పొందని కుటుంబాలను గుర్తించి, దరఖాస్తు చేయించేలా ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. నిరంతర ఫాలోఅప్, కలెక్టర్ సహకారంతో జిల్లా స్థాయిలో ప్రజల్లో  చైతన్యం ఏర్పడింది.

ఫలితం: 2025 ఏప్రిల్ నాటికి యాదాద్రి జిల్లా రాష్ట్రంలో అత్యధిక లబ్ధిదారులతో మొదటి స్థానంలో నిలిచింది. ఈ విజయంతో ఇప్పుడు రాష్ట్రమంతటా NFBS పథకం మీద చర్చ మొదలైంది.


మా డిమాండ్లు :

లబ్ధి మొత్తాన్ని ₹50,000 కు పెంచాలి. ఏదైనా ఒక రాష్ట్రంలో  అమలులో ఆలస్యం అయితే మళ్ళీ అప్పటి నుండి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలి. దరఖాస్తు గడువు కనీసం 2  సంవత్సరాలు ఉండాలి. రాష్ట్రాల వారీగా జాతీయ స్థాయి అధ్యయనం జరగాలి. మహిళల కోసం ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయాలి. జిల్లా స్థాయిలో డేటా సేకరణ ద్వారా విధానపరమైన చర్చలు జరపాలి.


సంక్షిప్తంగా

NFBS పథకానికి లక్షలాది కుటుంబాలకు ఆర్థికంగా, మానసికంగా భరోసా కల్పించే సామర్థ్యం కలిగి ఉంది. కానీ అమలులో ఉన్న లోపాలు ప్రజలకు ఆసక్తి లేకుండా చేస్తున్నాయి



Kondal Reddy

+91 99488 97734

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment