about - సాంకేతికత విలువ ఆధారిత ఉత్పత్తులతో సహకార సంఘాల బలోపేతం
ఈ సమస్యను పరిష్కరించేందుకు అరటి చెట్టు బోదెల నుండీ బనానా ఫైబర్ సేకరించే యూనిట్ ను RDSSఅందించింది. ఈ యూనిట్ నెలకొల్పేందుకు 15 × 25 అడుగుల షెడ్ నిర్మాణానికి కోవా ఆర్ధిక సహకారం అందించింది. ప్రస్తుతం సహక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనంతపురం, సత్య సాయి జిల్లాలలో క్షేత్ర స్థాయి లో రూరల్ ఎన్విరాన్ మెంట్ డెవలప్ మెంట్ సొసైటీ (REDS) సంస్థ గ్రామీణ మహిళా రైతులతో పని చేస్తున్నది. వారిని సహకార సంఘాలుగా నిర్మిస్తున్నది. కదిరి మండలం లో మల్లయ్యగారి పల్లి మహిళా రైతు ఉత్పత్తి దారుల పరస్పర సహకార సంఘంకూడా అందులో ఒకటి.
ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో గత రెండు దశాబ్ధాలుగా పని చేస్తున్న రూరల్ డెవెలప్ మెంట్ సర్వీస్ సొసైటీ ( RDSS) సంస్థ రైతు సహకార సంఘాలకు సహాయం అందించే ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. హై రేడియస్ అనే సంస్థ , RDSS భాగస్వామ్యంతో తన CSR పథకం క్రింద సహకార సంఘాలకు ఆర్ధిక సహకారం అందిస్తున్నది. గత సంవత్సరం ఈ కార్యక్రమం క్రింద తెలంగాణ లో సంగారెడ్డి జిల్లా లో దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ ( DDS) ప్రోత్సాహంతో ఏర్పడిన మహిళా సహకార సంఘానికి, అనంతపురం జిల్లాలో REDS ప్రోత్సాహంతో ఏర్పడిన మల్లయ్యగారి పల్లి మహిళా రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘానికి పలు యంత్రాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం ఆర్ధిక సహకారం అందించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా RDSS,మల్లయ్యగారి పల్లి మహిళా రైతు ఉత్పత్తి దారుల పరస్పర సహకార సంఘంతో ఒక ఒప్పందం చేసుకుంది. మహిళా రైతుల సహకార సంఘం ఏర్పాటు చేసుకున్న బనానా ఫైబర్ యూనిట్ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడం, విలువ ఆధారిత ఉత్పత్తులను మరింత అభివృద్ధి చేయడం, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, ఈ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలను మెరుగుపరచడం ఈ ఒప్పంద లక్ష్యం.
ఇంతకుముందు ఈ సహకార సంఘం అధిక ధరలకు ఇతర వ్యక్తులు లేదా పరిశ్రమల నుంచి అరటి ఫైబర్‌ను కొనుగోలు చేసేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు అరటి చెట్టు బోదెల నుండీ బనానా ఫైబర్ సేకరించే యూనిట్ ను RDSSఅందించింది. ఈ యూనిట్ నెలకొల్పేందుకు 15 × 25 అడుగుల షెడ్ నిర్మాణానికి కోవా ఆర్ధిక సహకారం అందించింది. ప్రస్తుతం సహకార సంఘం స్వయంగా అరటి ఫైబర్‌ను వెలికితీసి, ఉత్పత్తి ఖర్చును తగ్గించడంతో పాటు విలువ ఆధారిత కార్యకలాపాలను మరింత పెంచుకునే అవకాశం పొందింది.
నానో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్,చిరు ధాన్యాల నుండీ ఇసుకను తొలగించే యంత్రాలను ఆధునిక సాంకేతికతతో అప్‌గ్రేడ్ చేశారు. దీని ద్వారా ప్రాసెసింగ్ సామర్థ్యం, ఉత్పత్తి నాణ్యత మెరుగుపడటంతో పాటు మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా వివిధ రకాల మిల్లెట్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయించే అవకాశం ఏర్పడింది.
వీటితో పాటు, మాట్ వీవింగ్ యంత్రాన్ని అందించడం ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తున్నది. దీని వల్ల బనానా ఫైబర్ తో చాలా రకాల ఉత్పత్తులు తయారు చేయడానికి వీలవుతుంది. ఇకపై FPO ఉత్పత్తుల వైవిధ్యాన్ని పెంచి మెరుగైన మార్కెట్ అవకాశాలను సృష్టించడం సంఘాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

O. Manoj Kumar
9640987404, FPO coordinator
No comments yet. Login to start a new discussion Start a new discussion