about - వికారాబాద్ జిల్లా ఆలుగడ్డ రైతుల సమస్యలను పరిష్కరించాలి

వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్పేట్, బంటారం, కోటిపల్లి, పెద్దేముల్, నవాబ్ పేట్, వికారాబాద్ ఇలా సుమారు ఏడు మండలాలలో మూడు వేల మంది రైత

 · 2 min read

వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్పేట్, బంటారం, కోటిపల్లి, పెద్దేముల్, నవాబ్ పేట్, వికారాబాద్ ఇలా సుమారు ఏడు మండలాలలో మూడు వేల మంది రైతులు ఐదు వేల ఎకరాలలో ఆలుగడ్డ పంటను సాగు చేస్తున్నారు. ఈ ఆలుగడ్డను సెప్టెంబర్ చివరి వారం నుండి  ప్రారంభించి నాటుతారు. ఈ పంట 75 రోజుల నుండి 90 రోజుల లోపు ఆలుగడ్డ తీయడానికి వస్తుంది.

వికారాబాద్ జిల్లాలో సుమారు రెండు లక్షల క్వింటాళ్ల ఆలుగడ్డ  దిగుబడి వస్తుంది. ఈ ఆలుగడ్డను రైతులు అమ్ముకోవాలంటే హైదరాబాదు నగరంలోని బోయిన్ పల్లి, మూసాపేట్,  గుడిమల్కాపూర్ తదితర మార్కెట్లకు తీసుకెళతారు. మన జిల్లాలో తీసినటువంటి ఆలుగడ్డనే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాలలో పండించిన ఆలుగడ్డను  కూడా అదే సమయానికి మార్కెట్ కు వస్తుంది. భూమిలో 75 రోజుల నుంచి 90 రోజుల లోపు భూమిలో నుండి బయటకు తీయాలి. ఎక్కువ రోజులు  భూమిలో ఉంటే ఆలుగడ్డ మురిగిపోయే ప్రమాదం ఉంటుంది. తక్కువ రోజులలో తీస్తే కనుక ఆలుగడ్డ పచ్చిగా మెత్తగా ఉంటుంది గట్టి పడదు కనుక తినడానికి, ప్రజల అవసరాలకు  పనికిరాదు.

స్థానిక రైతులు ఈ ఆలుగడ్డను భూమిలో నుండి తీసిన తర్వాత రెండు మూడు రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉంచడానికి వీలు ఉండదు. ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ఆలుగడ్డ మొలకెత్తడం ద్వారా పాడైపోతుంది ఫలితంగా రైతులకు సరైన ధర లభించదు.

భూమిలో నుంచి తీసిన వెంటనే  ఆలుగడ్డను రైతులు మార్కెట్ కు తీసుకెళ్తారు. రైతులందరూ  ఆలుగడ్డను ఒకేసారి పెద్ద ఎత్తున మార్కెట్ కు తరలిస్తారు.


15 రోజుల నుండి నెల రోజుల వ్యవధిలో సీజన్ పూర్తి అవుతుంది కాబట్టి ఒకే సారి పెద్ద ఎత్తున ఆలుగడ్డను మార్కెట్ కు తీసుక వస్తారు. ఈ కారణంగా వ్యాపార వేత్తలు ఒకటిగా మారిపోయి అతి తక్కువ ధరకు కొంటారు. ఈ  కారణంగా రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఇలా రైతులందరూ ఒకే సారి మార్కెట్ కు రాకుండా ఉండాలంటే ఆలుగడ్డ నిల్వ ఉండటానికి స్థానికంగా సౌకర్యం ఉండాలి. కాని అలాంటి సౌకర్యం మన రాష్ట్రంలో లేదు. దీని ఫలితంగా ఈ ఆలుగడ్డ రైతులు నష్టపోతున్నారు. ఒరిస్సా, మహారాష్ట్ర కర్ణాటక మొదలగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది క్వింటాళ్ళ మన రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజిలు లేకపోవడం, కోల్డ్ స్టోరేజీలు లేని మూలంగా మన ఆలుగడ్డకు సరైన రంగు లేకపోవడం, పొట్టు గట్టిపడక ఆలుగడ్డ పచ్చిగా ఉండటం వల్ల మన రాష్ట్రంలోనీ రైతులు పండించిన ఆలుగడ్డకు సరైన ధర లభించడం లేదు సరైన మద్దతు ధర లభించాలంటే మంచి రంగు కలిగినటువంటి ఆలుగడ్డ నిలవ ఉంచుకోవడానికి కోల్డ్ స్టోరేజీలు ఉండటం చాలా అవసరం. కానీ మన రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజీలు లేవు.కోల్డ్ స్టోరేజీలు లేకపోవడం వల్లనే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆలుగడ్డ కోల్డ్ స్టోరేజీలలో నిల్వ ఉంచి ధర లభించే సమయానికి మార్కెట్ కు తీసుకొస్తారు. కాబట్టి దానికి ఎక్కువ ధర పలుకుతుంది. ఈ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించి కోల్డ్ స్టోరేజీలు నిర్మించుటకు ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలి.



Vadla. Amareshwar

7036135805, Field Coordinator, Vikarabad

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment