about - వడ్ల కొనుగోలు కేంద్రం లో రైతుల సమస్యలు

వడ్ల కొనుగోలు కేంద్రంలో ప్రజల నుండి కొనుగోలు చేసే మిల్లర్ల నుండి చాలా ప్రాబ్లం ఏర్పడడం జరిగింది ఆ సమయంలో కిసాన్ మిత్ర కాల్ సెంటర్ కు ఫోన్ చేసి పై అధికారుల నుండి మాకు సహకారం అందించగలరని తెలుపడం జరిగింద

 · 2 min read

   బెన్నూరు వడ్ల కొనుక్కోలు కేంద్రం నుండి. ఏకలవ్య ఫౌండేషన్ వారు. వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వాహకులు. శివకుమార్ గారు వీరు ప్రస్తుతం యాలాల గ్రామపంచాయతీ సర్పంచ్ గారు వీరికి వడ్ల కొనుగోలు కేంద్రంలో ప్రజల నుండి కొనుగోలు చేసే మిల్లర్ల నుండి చాలా ప్రాబ్లం ఏర్పడడం జరిగింది ఆ సమయంలో కిసాన్ మిత్ర కాల్ సెంటర్ కు ఫోన్ చేసి పై అధికారుల నుండి మాకు సహకారం అందించగలరని తెలుపడం జరిగింది. ఈ విషయాన్ని యాదయ్య గారు మేము కలిసి మన కిసాన్ మిత్ర కాల్ సెంటర్ కు మరియు సెంట్రల్ ట్రైన్ కు ఇక్కడ జరిగిన సమస్యను వివరించడం జరిగింది. అప్పుడు భార్గవి మేడం గారు. ఉమా గారు. వడ్ల కొనుగోలు కేంద్రంలో ఏమేం సమస్యలున్నాయి మిల్లర్ల దగ్గర కూడా వెళ్లి తెలుసుకొని మనకు ముఖ్యమైన పాయింట్లు రాసి పంపగలరని తెలుపడం జరిగింది.

1. ముఖ్యంగా గన్ని బ్యాగుల సమస్య ఉన్నందువలన రైతులు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు..

2. తూకంలో అవకతవకలు జరగడం కూడా జరిగింది..

3. వడ్ల కొనుగోలు మిల్లర్ల నుండి కూడా లారీలు దింపకపోకపోవడం చాలా సమస్యగా ఉండేది..

4. రైతుల సెంటర్కు తెచ్చిన వడ్లని తేమ శాతం ఎక్కువగా ఉంది తాలు ఎక్కువగా ఉంది అని సమస్యగా ఏర్పడి ఉండే..

పై విషయాలని మనము సెంట్రల్ టీమ్ నుండి కలెక్టర్ గారికి లెటర్ రాయడం జరిగింది ఈ లెటర్ ని వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్ లో యాదయ్య గారు నేను నరసింహులన్న అమరేశ్వర్ గారు అందరం కలిసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది.


మనము సెంట్రల్ టీం నుండి లెటర్ కలెక్టర్ గారికి పంపడం ద్వారా వారు వెంబడే అన్ని వడ్ల కొనుగోలు కేంద్రాలని సందర్శించడం జరిగింది.

అటు తర్వాత వడ్ల కొనుగోలు కేంద్రం నుండి ప్రజలకు మంచి సహకారం అందించడం జరిగింది మరియు రైస్ మిల్లర్లు కూడా లారీలను ఆపకుండా వెంబడింపడే దింపుకోవడం జరిగింది రైతులకు ఎప్పటికప్పుడు డబ్బులు కూడా వెంబడే రావడం జరిగింది ఈ విషయాన్ని ఏకలవ్య ఫౌండేషన్ నిర్వాహకులు శివకుమార్ గారు చాలా సంతోషపడుతూ కిసాన్ మిత్ర కాల్ సెంటర్ ద్వారా మా సెంటర్ కు చాలా మేలు జరిగింది పెండింగ్ ఉన్నటువంటి డబ్బులు కూడా మీరు సహకరించినందుకు రైతులకు మేము ఎంబడి వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది అని తెలపడం జరిగింది. కిసాన్ మిత్ర కాల్ సెంటర్ నుండి కలెక్టర్ గారికి మీరు లెటర్ పంపినందువలన మాకు చాలా మేలు జరిగింది అన్ని సెంటర్లకు డబ్బులు కూడా పైనుండి తొందరగా రిలీజ్ కావడం జరిగింది మిల్లర్ల నుంచి కూడా మాకు తక్షిట్లు తొందర తొందరగా పంపియడం జరిగింది కొనుగోలు కేంద్రంలో చాలా సమస్యలు కిసాన్మిత్ర కాల్ సెంటర్ నుండి తీరినై కాబట్టి కిసాన్ మిత్ర కాల్ సెంటర్ వారికి ధన్యవాదాలు అని బెన్నూర్ సెంటర్ నిర్వాహకులు మరియు సుటుమూడు గ్రామాల ప్రజలు కూడా తెలపడం జరిగింది. ఇది మనకు కిసాన్ మిత్రుల నుండి మంచి కార్యక్రమం ప్రజలకు అందిస్తుంది నా యొక్క అభిప్రాయం దీంట్లో ఏమన్నా తప్పులు ఉంటే సరి చేయగలరు.



K. Karunanidhi

8500650321, Field Coordinator, Vikarabad

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment