about - లబ్దిదారు మరణిస్తే నామినీకి చేకూరిన లబ్ది
PM Kisan లబ్దిదారు మరణిస్తే నామినీకి చేకూరిన లబ్ది
కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు ఫోన్ చేసిన శ్రీరాముల గంగన్న నాన్న గారు 2024 ఏప్రిల్ నెలలో మరణించారు. మరణానికి ముందే PM కిసాన్ స్కీమ్ కింద 3 ఇంస్టాల్‌మెంట్‌ల డబ్బులు మరియు ఉపాధి హామీ డబ్బులు మొత్తం RS.10,200 రూపాయలు ఆయన ఖాతాలో జమ అయినప్పటికీ, అవి విత్‌డ్రా చేసుకోలేదు.
ఈ డబ్బులను తీసుకోవడం కోసం ఆయన డెత్ సర్టిఫికేట్, డిపెండెంట్ సర్టిఫికేట్, నామినీగా ఉన్న వారి తల్లి గారి వివరాలతో పోస్ట్ ఆఫీస్ కి వెళ్లారు. అయితే పోస్ట్ ఆఫీస్ అధికారులు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో పాటు, స్పష్టమైన కారణాన్ని కూడా తెలియ జేయలేదు.
కిసాన్ మిత్ర జోక్యం
ఈ రైతు చాలా రోజులుగా ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, ఫలితం రాలేదు.

నేను రైతును తీసుకుని తాంసీ పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళాను, ప్రాసెస్ అడగగా వారు ముందుగా ఎంపీడీవో ఆఫీస్ నుండి నామినీ పేరు తో కూడిన లెటర్ తీసుకు రావాలని తెలిపారు వెంటనే తలమడుగు ఎంపీడీవో ఆఫీస్ కి వెళ్లి సమస్యను వివరించి ఎంపీడీవో గారి దగ్గరి నుండి లెటర్ తీసుకుని మళ్లీ తాంసీ పోస్ట్ ఆఫీస్ కి సమర్పించి, నామినీ పేరుతో కొత్త ఖాతా ఓపెన్ చేయించడం జరిగింది. రెండు రోజుల తర్వాత డబ్బులు (Rs.10,200) ఇచ్చారు.
ఫీల్డ్ కోఆర్డినేటర్ జోక్యం చేసుకోవడం, సరైన ప్రాసెస్‌ను తెలుసుకుని, అవసరమైన డాక్యుమెంట్లను సేకరించడం, సంబంధిత అధికారులతో సమన్వయం చేయడం వల్ల ఈ సమస్య పూర్తిగా పరిష్కారమైంది.
M. Ramakanth
Kisan Mitra Adilabad Field Coordinator
No comments yet. Login to start a new discussion Start a new discussion