about - రైతు భరోసా - అమలు, సమస్యలు
రైతు భరోసా నగదు బదిలీ పథకం (DBT) ద్వారా ఈ పథకం ద్వారా ప్రతి సీజన్ కు 6000-/ రైతులకు ఎకరానికి జమ చేయబడుతుంది.
రైతు భరోసా నగదు బదిలీ పథకం (DBT) ద్వారా ఈ పథకం ద్వారా ప్రతి సీజన్ కు 6000-/ రైతులకు ఎకరానికి జమ చేయబడుతుంది.
రైతు భరోసా పొందడానికి సాధారణ అర్హతలు
- తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి.
- భూమిని వ్యవసాయ యోగ్యంగా ఉపయోగించగల భూమి ఉండాలి. వ్యవసాయ యోగ్యం కాని భూములు, మైనింగ్, రియల్ ఎస్టేట్ స్థలాలు ఇంకా ఇతర వాణిజ్య స్థలాలు ఈ పథకాలకాట అనర్హం.
- ధరణి / భూ భారతి పోర్టల్ లో నమోదు ఉండాలి.
- ROFR పాస్ పుస్తకం కలిగిన రైతులు కూడా అర్హులు.
2025లో, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ₹9,000 కోట్లు విడుదల చేసింది. దీన్ని 1.49 కోటి ఎకరాల వ్యవసాయ భూములపై అమలు చేసింది. కానీ రభీ మరియు ఖరీఫ్ సీజన్‌లలో చాలా మందికి రైతుభరోసా అందలేదు. భూ విస్తీర్ణం 4.20 ఎకరాల పైన, అంతకు లోపు ఉన్నవారికి కూడా చాలామందికి అందలేదు.
దాదాపుగా కిసాన్ మిత్ర కి 2261 కాల్స్ రైతు భరోసా గురించి రావడం జరిగింది. గత కొన్నేళ్లుగా రైతు భరోసా స్టేటస్ చూసుకోవడానికి ఆన్లైన్ లో ఆప్షన్ లేదు కావున కిసాన్ మిత్ర కి కాల్ వచ్చిన వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారికి సంప్రదించి రైతు కు పేమెంట్ స్టేటస్ అప్డేట్ చేస్తాము. అలానే పేమెంట్ లో ఏదైనా సమస్య ఉంటె దానికి సంబంధించి ఎం చెయ్యాలి అనేది కూడా గైడ్ చేస్తాము. కొన్ని సమయాలలో కిసాన్ మిత్ర ఫీల్డ్ కోఆర్డినేటర్ కి కూడా కేసు అసైన్ చేస్తాము వారు స్థానికంగా అధికారిని కలిసి సమస్య వివరాలు తెల్సుకొని అధికారితో మరియు రైతు తో ఆ సమస్య సాల్వ్ అయ్యేంత వరకు ఫాలో అప్ చేస్తారు. ఇంకొన్ని సమయాలలో జిల్లా స్థాయిలో కూడా ఫాలో అప్ చేస్తాము అక్కడ సాల్వ్ అవ్వని తరుణాలలో సీఎం ప్రజావాణి లో కూడా దరఖాస్తు ఇచ్చి సమస్య సాల్వ్ అయ్యి రైతులకు డబ్బులు వచ్చేలా చేస్తాము.
ముఖ్యం గా రైతు భరోసా డబ్బులు పడకపోవడానికి గల కారణాలు మాకు వచ్చిన సమస్యల ప్రకారం ఈ క్రింది విధంగా ఉన్నాయి.
భూమి సమస్యలు:
- భూమి వివరాలు ఆన్లైన్ లో కనిపించకపోవడం
- భూమి ఇతరుల పేరు మీద నమోదు కావడం
- ROFR పట్టా సమస్యలు
బ్యాంకింగ్ & DBT సమస్యలు:
- DBT విఫలమవడం
- తప్పు లేదా వినియోగం లో లేని బ్యాంక్ ఖాతా
- ఆధార్ బ్యాంక్ ఖాతాకు లింక్ కాకపోవడం
- బ్యాంకు అకౌంట్, ఆధార్ మరియు భూమి రికార్డ్స్ మధ్య పేర్ల తేడాలు
చెల్లింపుల సమస్యలు:
- చెల్లింపు రాలేదు
- మునుపటి సీజన్ డబ్బులు క్రెడిట్ కాకపోవడం
- పేమెంట్ ప్రాసెస్ అయ్యింది కానీ డబ్బులు ఇంకా క్రెడిట్ కాలేదు
- ఫైల్ అంగీకరించబడినప్పటికీ ట్రెజరీ వద్ద పెండింగ్‌లోఉంది.
ఈసారి ROFR పట్టాలు ఉన్నవారికి 10 ఏకరాల కంటే ఎక్కువగా భూమి ఉంది అని రైతుభరోసా డబ్బులు వేయలేదు. ROFR పట్టాలు ఉన్నవారికి రైతు భరోసా డబ్బులు పడకపోవడానికి గల కారణాలు:
- ఒకే వ్యక్తికి రెండు ROFR పట్టాలు ఉన్నవారికి రైతు భరోసా డబ్బులు పడలేదు.
- ROFR భూములు ఉన్న వారికి వ్యవసాయ అధికారి డాక్యుమెంట్స్ తీసుకొని ధరఖాస్తు పెట్టాలి కానీ ఈ సారి చాలా మందివి కొత్త ధరఖాస్తులు పెట్టలేదు.
Katta. Navaneetha
KisanMitra, Coordinator
No comments yet. Login to start a new discussion Start a new discussion