about - ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న రైతులందరికీ అధికారిక హక్కులు కల్పించాలి

భూమిలో 70 మంది రైతులు, గత 60 సంవత్సరాలుగా వ్యవసాయ చేసుకుంటున్నారు. వీరు దశాబ్ధాలుగా అనేక దఫాలుగా ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్లి తాము సాగు చేసుకుంటున్న భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని దరఖాస

 · 1 min read

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కోత్లాపూర్  గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 142 , 30,106, 34,175 లో ప్రభుత్వ భూమి సుమారు 1000 ఎకరాలు ఉన్నది.  

ఈ  భూమిలో70 మంది రైతులు, గత 60 సంవత్సరాలుగా వ్యవసాయ చేసుకుంటున్నారు.  ఈ భూములలో ప్రధాన పంటలుగా  పత్తి, మొక్కజొన్న, కంది, పెసర, సోయా,  పచ్చ జొన్న, మినుము ఉన్నాయి.  కూరగాయలు,పూలు కూడా  పండిస్తున్నారు.

వీరు దశాబ్ధాలుగా అనేక దఫాలుగా ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్లి తాము సాగు చేసుకుంటున్న భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని దరఖాస్తులు పెట్టుకున్నారు. కానీ ఇప్పటివరకూ  సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం ఎటువంటి అధికారాలు భూమి పై కల్పించలేదు.  ఫలితంగా సాగులో ఉన్న రైతులకు చాలా నష్టం జరుగుతున్నది.

2018 సంవత్సరం కంటే ముందు కొంతమంది రైతులు ఈ భూములపై బ్యాంకుల నుంచి పంట రుణాలు కూడా తీసుకున్నారు, తిరిగి చెల్లించారు.


2018 సంవత్సరంలో  ఆన్లైన్ పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన తర్వాత వీరికి ఆన్లైన్ పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదు.

ప్రస్తుతం  వీరి పేర్లు రికార్డులలో లేనందువల్ల బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదు. ప్రస్తుతం  ప్రతి సీజన్ లో వేలాది రూపాయలు  ఖర్చు పెట్టి ఈ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు ప్రోత్సాహకాలు  అందడం  లేదు. అధికారుల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు, వీరికి ఎటువంటి నష్టపరిహారం లభించడం లేదు.

పంటల నష్టం జరిగినప్పుడు వీరు తీవ్రంగా నష్ట పోతున్నారు.  ఈ రైతులకు జరుగుతున్న నష్టం గుర్తించి, ఈ భూములలో వాస్తవంగా ఎవరైతే సాగు చేస్తున్నరైతులు ఉన్నారో ఆ  రైతులను గుర్తించి వారి పేర్లు రికార్డులో నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి.



Vadla. Amareshwar

7036135805, Field Coordinator, Vikarabad

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment