about - జొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం కిసాన్ మిత్ర ప్రయత్నాలు
జొన్నల కొనుగోలు చేసే ముందు ప్రభుత్వ అధికారులు రైతులకు సమాచారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఏఈవోలు పంట నమోదు చేసుకున్న తర్వాత మాకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని చెబుతున్నారు. కొనుగోలు కేంద్రం కూడా రైతుల
2025 సంవత్సరం లో జొన్నలు అమ్ముకోవడానికి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం కూడా రైతులు జొన్నల కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారు ? రైతులకు సమాచారం ఇవ్వాలని అడుగుతున్నారు.
గత సంవత్సరం 2025 మే 31 జొన్నల కొనుగోలు కేంద్రాలు మూసివేయడం వల్ల మాకు చాలా నష్టం జరుగుతుందని అధికారులు చెప్పకుండానే మూసివేయడం జరుగుతుందని రైతులు వాపోయారు. రైతుల గురించి కిసాన్ మిత్ర పని చేస్తుందని తెలుసుకొని కిసాన్ మిత్ర కాల్ సెంటర్ కు ఫోన్ చేశారు. కిసాన్ మిత్ర బాధ్యులు , ప్రభుత్వ అధికారులతో మాట్లాడి, అదనంగా ఒక నాలుగు రోజుల సమయం ఇప్పించారు . నాలుగు రోజుల్లో మేము పండించిన పంటను కనీస మద్దతు ధరకు అమ్ముకోగలిగామని రైతులు సంతోషపడ్డారు.
ఈ సంవత్సరం జొన్నల కొనుగోలు గురించి రైతులు ముందు జాగ్రత్తగా కిసాన్ మిత్ర ఫీల్డ్ కో ఆర్డినటర్ లను కలిసి జొన్నల కొనుగోలు గురించి మాట్లాడుతున్నారు. జొన్నల కొనుగోలు చేసే ముందు ప్రభుత్వ అధికారులు రైతులకు సమాచారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఏఈవోలు పంట నమోదు చేసుకున్న తర్వాత మాకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని చెబుతున్నారు. కొనుగోలు కేంద్రం కూడా రైతులకు అందుబాటులో లేదు.
పంటను అమ్ముకోవడానికి సుమారు 40 కిలోమీటర్ల వరకు రైతులు వెళ్ల వలసి వస్తుంది. జిల్లాలో రెండు కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి పూడూరు మండలం అంగడి చిట్టంపల్లి లో ఉంది. రెండవది మర్పల్లి మండలం మర్పల్లి లో ఉంది..రెండు కూడా పిఎసిఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండే విధంగా అధికారులకు చెప్పాలని కిసాన్ మిత్ర కు రైతులు ఫోన్ చేస్తున్నారు.
ఈ విషయంపై మండల ఏవో ను కలిసి చర్చించాం . ఈ సంవత్సరం క్రాప్ బుకింగ్ క్రింద జొన్న పంట ఎంతమంది రైతులు నమోదు చేసుకున్నారని తెలుసుకున్నాం. దారూర్ మండలంలో 13 వందల ఎకరాలు పంట నమోదు చేశామని ఏవో చెప్పారు. జొన్నల కొనుగోలు సమస్యపై కిసాన్ మిత్ర నుండి జిల్లా, రాష్ట్ర కోఆర్డినేటర్ లు గ్రామాలకు వచ్చి రైతుల సమస్యలను జొన్నల కొనుగోలు సమస్య పై గ్రామాల్లో రైతులతో ముఖాముఖి చర్చలు చేసి తెలుసుకున్నారు.
దారూర్ మండల్ లో పంట నమోదు ఎక్కువ ఉన్నందున మండల కేంద్రంలో జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కిసాన్ మిత్రకు రైతులు ఫోన్ చేస్తున్నారు . ఈ విషయం పై జిల్లా కలెక్టర్ కు జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తమ పార్టీ తరపున మెమోరండం ఇచ్చారు.

J. Narsimhulu
Kisan MItra Vikarabad Field Coordinator
No comments yet. Login to start a new discussion Start a new discussion