about - ఛత్తీస్ ఘడ్ లో ప్రజా ఆరోగ్య కేంద్రాలను పరిశీలించిన RDSS బృందం

2026 మార్చ్ 22 న మా బృందం JSS హాస్పిటల్ కు చేరుకున్నది. JSS సంస్థ ప్రజా ఆరోగ్య వైద్య సేవలు ఎలా అందిస్తున్నదో ముందుగా JSS కో -ఆర్డినేటర్ రవిఇంద్ర వివరించారు.

 · 2 min read

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బిలాస్ పూర్ జిల్లా గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాలలో  ప్రజా ఆరోగ్య వైద్య సేవలను నిర్వహిస్తున్న JSS  సంస్థ కార్యక్రమాలను  ఇటీవల RDSS సంస్థ CEO బాలు నేతృత్వం లో,  DR రోహిత్, వంతల రాజు, సీదరి చిన్నారావు,  V. H. W జ్యోతి, అనూష, సత్యవతి బృందం పరిశీలించింది.  అల్లూరి సీతారామరాజు జిల్లా G, మాడుగుల, చింతపల్లి మండలాల ఆదివాసీ ప్రాంతాలలో RDSS  ఆధ్వర్యంలో గత కొంత కాలంగా వైద్య సేవా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

2026 మార్చ్ 22 న  మా బృందం JSS హాస్పిటల్ కు చేరుకున్నది. JSS సంస్థ ప్రజా ఆరోగ్య వైద్య సేవలు ఎలా అందిస్తున్నదో ముందుగా JSS కో -ఆర్డినేటర్ రవిఇంద్ర వివరించారు.

హాస్పిటల్ లో మొత్తం 250 బెడ్లు ఉన్నాయి. మేము రోజుకు 300 వందల మందిని   మాత్రమే అవుట్ పేషంట్ గా చూస్తాము. మా హాస్పిటల్ లో రోగుల నుండీ  తక్కువ డబ్బులు తీసుకుంటాం. ఆయా అనారోగ్య  సమస్యలను బట్టి,  పేదవారికయితే ఉచితంగా వైద్యం అందిస్తారు. 300 వందల మంది కంటే ఎక్కువ మంది వస్తే మరుసటి రోజు ఓపి గా చూస్తారు.

ఆసుపత్రి కి వచ్చిన వారిలో క్రమ సంఖ్య  వారీగా మాత్రమే  వైద్య పరీక్షలు  నిర్వహిస్తారు.  JSS హాస్పిటల్ లో ఆడ పిల్లలకు నర్సింగ్ కళాశాల కూడా ఉంది. ఈ హాస్పిటల్ మన దగ్గర ఒక జిల్లా హాస్పిటల్ లాగా  ఉంది. గుండె, మెదడు జబ్బు లకు తప్ప మిగిలిన  ఆరోగ్య సమస్యలకు సదుపాయాలు ఉన్నాయి. ఒక్కో ఆరోగ్య సమస్యకు, ఒక్కొక్క వార్డు ఉంది.


JSS హాస్పిటల్ లో మూడు పూటలా భోజన సదుపాయం కూడా ఉంది. జబ్బులవారీగా క్రమం తప్పకుండా 9 రోజుల వరకు వైద్య సేవలు అందిస్తారు. JSS యాజమాన్యం వైద్యం తో పాటు సేంద్రియ వ్యవసాయం ద్వారా ప్రోత్సాహిస్తున్నది. రైతులకు విత్తనాల పంపిణీ తో పాటు,  రైతులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. మహిళలకు నైపుణ్య శిక్షణలు అందిస్తున్నారు. ఉదాహరణకు కార్పెంటర్స్, కుటుమిషన్స్, తాపీ పని, ప్లంబింగ్  మొదలైన నైపుణ్య శిక్షణలు అందిస్తున్నారు. JSS హాస్పిటల్ కు మూడు సబ్ సెంటర్లు కుడా ఉన్నాయి.

రెండవ రోజు సబ్ సెంటర్స్ లో ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారో (VHW) కూడా చూశాం. ఎక్కువ పని సబ్ సెంటర్స్ లోనే జరుగుతున్నది.  ఉదాహరణకు మలేరియా, పాముకాటు, కుక్క కాటు, షుగర్  జబ్బు కూడా  VHW నిర్వహిస్తున్నారు.  జబ్బులనుగుర్తించి మందులు ఇవ్వడం, జబ్బుల వారిగా గ్రూపు సమావేశాలు, రికార్డులు రాయడం, గ్రామాలలో జబ్బులు గుర్తించడం మొదలైన  పనులు  సబ్ సెంటర్స్ నిర్వహిస్తున్నాయి.

పూల మాల :

చిన్న పిల్లలు 2, 3, 4 సంవత్సరాల వయసులో గల పిల్లలకు రోజూగుడ్డు,కిచిడి లాంటి పౌష్టిక ఆహారం అందించడం, ఆటలు ఆడించడం ద్వారా పిల్లలు మంచి పెరుగుదల కు ఉపయోగపడుతున్నది. ఒక మాటలో చెప్పాలంటే, మన దగ్గర అంగన్వాడీ సెంటర్ లాగా పని చేస్తున్నది.  నిరుపేద కుటుంబాలకు తోడుగా, నీడగా పని చేస్తున్నది.



GS
Gadi Sreenu

9948084888,RDSS, Director

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment