about - చేయూత కోసం చాన్నాళ్లుగా ఎదురుచూపు ఎట్టకేలకు రీ - స్టార్ట్ అయిన పెన్షన్
హైదరాబాద్ లో SERP ఆధికారులతో, కిసాన్ మిత్ర రాష్ట్ర బాధ్యులు మంగ్య విషయం గురించి మాట్లాడారు. స్టేట్ లెవెల్ లో సరి చేసిన తరువాత మంగ్య గారికి పెన్షన్ అమౌంట్ విడుదల అయింది. మంగ్య గారికి పెన్షన్ రిలీజ్ అ
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం చిన్న బుగ్గారమ్ గ్రామానికి చెందిన జాదవ్ ఫుల్లి బాయి భర్త జాదవ్ మంగ్యతనకు 2014 కంటే ముందు పెన్షన్ వస్తుండేదని, ఆ తరువాత పెన్షన్ ఆగిపోయిందని, ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న పైలెట్ ప్రజావాణి లో దరఖాస్తు పెట్టారు.నేరడిగొండ లో పబ్లిక్ హియరింగ్ కూడా ఆయనవచ్చారు.
అధికారులకు తన పెన్షన్ ఆగిపోయిన విషయం గురించి వివరించారు. 2014 నుండి చాలా సార్లు కార్యాలయాలకు వచ్చి అధికారులను కలిశాననీ, కానీ పెన్షన్ స్టార్ట్ కాలేదనీ చెప్పారు. అధికారులు (MPDO) 2015 లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే) సందర్భంగా, ఆధార్ లో వయస్సు తక్కువగా ఉందని పెన్షన్ ఆపి వేశారని చెప్పారు. మాకు ఇప్పుడు పెన్షన్ పునరుద్ధరించడానికి యాక్సెస్ లేదని చెప్పారు.

ఈ సమస్యపై హైదరాబాద్ లో SERP ఆధికారులతో, కిసాన్ మిత్ర రాష్ట్ర బాధ్యులు మంగ్య విషయం గురించి మాట్లాడారు. స్టేట్ లెవెల్ లో సరి చేసిన తరువాత మంగ్య గారికి పెన్షన్ అమౌంట్ విడుదల అయింది. మంగ్య గారికి పెన్షన్ రిలీజ్ అయిందనీ, పెన్షన్ డబ్బులు తీసుకున్నారా లేదా అని ఫీల్డ్ కి వెళ్ళి కనుక్కోమన్నారు.
కంటిన్యూ గా 3 నెలలు పెన్షన్ డబ్బులు తీసుకోకపొతే migration కింద మళ్ళీ పెన్షన్ ఆగిపోతుందని అన్నారు. నేను మంగ్య గారి గ్రామానికి వెళ్ళి మంగ్య గారి కుటుంబ సభ్యులను కలిశాను. మంగ్య గారికి ఉండడానికి ఇల్లు లేదు. కనీసం ఇందిరమ్మ ఇల్లు కట్టు కోవడానికి స్థలం కూడా లేదు.వేరే వారి స్థలం లో గుడిసె కట్టుకుని ఉంటున్నారు.
మంగ్య భార్య ఫుల్లి బాయి తో మంగ్య విషయం చర్చించినప్పుడు, మంగ్య 2025 జులై 25 న చనిపోయారని చెప్పారు.మంగ్య గారికి పెన్షన్ పునరుద్ధరణ జరిగినా, పెన్షన్ తీసుకోకుండానే చనిపోయారు. మంగ్య పెన్షన్ ID యాక్టీవ్ అయింది కాబట్టి మంగ్య గారి భార్య కి spouce పెన్షన్ కోసం దరఖస్థు పెట్టీంచాను.
ఫుల్లి బాయి అప్పటికి మంగ్య డెత్ సర్టిఫికెట్ తీసుకోలేదు.పంచాయతి సెక్రటరీతో మాట్లాడి డెత్ సర్టిఫికెట్ తీసుకున్నాను.ఫుల్లి బాయి కి SBI బ్యాంక్ ఎకౌంట్ దగ్గరుండి ఓపెన్ చేసి ఇచ్చాను. spouce పెన్షన్ ఫాం తీసుకోని దానిపై పంచాయతి సెక్రటరీ సంతకం తీసుకోని డాక్యుమెంట్స్ అటాచ్ చేసి MPDO ఆఫీసు నేరడిగొండ లో ఇచ్చాను.
మండల్ లో ప్రాసెస్ చేసిన తరువాత District (DRDO) office లో follow up చేశాను. ఎట్టకేలకు మంగ్య గారి భార్య జాదవ్ ఫుల్లి బాయి గారికి 2025 నవంబర్ లో spouce పెన్షన్ sanction అయింది. వారు పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారు.
Sk. Sharukh
Kisan Mitra Adilabad Field Coordinator, 9542084628
No comments yet. Login to start a new discussion Start a new discussion