about - గ్రామీణ అభివృద్ధిలో మరో ముందడుగు

DDS మహిళా రైతుల సహకార సంఘానికి RDSS తోడ్పాటు

 · 1 min read

రూరల్ డెవలప్ మెంట్ సర్వీస్ సొసైటీ (RDSS) 2026 మార్చ్ నెలలో మహిళా రైతు ఉత్పత్తి దారుల సాధికారతే లక్ష్యంగా కీలకమైన అడుగులు వేసింది. జహీరాబాద్‌లోని DDS (డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ)  మహిళా రైతుల సహకార సంఘానికి వ్యాపార ప్రణాళికలు (Business Plans), మార్కెటింగ్,  పాలనా పరమైన అంశాలలో అవసరమైన సహాయ సహకారాలను అందించడంలో కొన్ని చర్యలు చేపట్టింది.

ఈ నెలలో మా బృందం సభ్యులు విస్సా కిరణ్ కుమార్, నవీన్ రామిశెట్టి, రవి  కన్నెగంటి, రైతు స్వరాజ్య వేదిక సంగారెడ్డి జిల్లా నాయకులు లక్ష్మి తో  కలిసి నేను క్షేత్రస్థాయిలో పర్యటించాను. సహకార సంఘం కార్యక్రమాలను అర్థం చేసుకోవడానికి స్థానిక టీం తో చర్చించాము.

ఈ పర్యటనలో భాగంగా తీసుకున్న నిర్ణయాల మేరకు, సహకార సంఘానికిఉపయోగపడేలా ఈ క్రింది చార్యాలు తీసుకున్నాము.

యంత్రాల సరఫరా: సహకార సంఘంలో సభ్యులుగా ఉన్న నూనె గింజలు  సాగు చేసే రైతులకు వెసులుబాటు కల్పించేందుకు ఒక ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ (Oil Extraction) మెషీన్‌ను అందించాము. అలాగే, కుసుమల పొట్టు  తీయడానికి

శాఫ్ ఫ్లవర్ డీకార్టికేటర్ (Safflower Decorticator) మెషీన్‌ను కొనుగోళ;ఉ చేశాము.

నిల్వ వసతి: చిరుధాన్యాలు (Millets), ఇతర పంటలను దీర్ఘకాలం పాటు భద్రపరుచుకోవడానికి వీలుగా గోదాములో స్టోరేజ్ ప్యాలెట్లను (Storage Pallets) ఏర్పాటు చేశాము.

మౌలిక సదుపాయాల కల్పన: పంటల ప్రాసెసింగ్ కోసం తగిన భవనం లేకపోవడాన్ని గుర్తించి, ఇంజనీర్ల ప్లాన్ ప్రకారం షెడ్ నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేశాము. పారదర్శకత కోసం, లేబర్ ఛార్జీలు మినహా మిగిలిన మొత్తాన్ని నేరుగా సంబంధిత వ్యాపారులకు, సరఫరాదారులకు చెల్లించాము.

జహీరాబాద్ ప్రాంత మహిళా సహకార సంఘం  ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో, వారికి అవసరమైన సాంకేతిక, మౌలిక వసతులను సమకూర్చడం మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఏప్రిల్  నెలలో ఈ ప్రాసెసింగ్ యూనిట్ లన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలా మా బృందం కృషి చేస్తోంది.


O. Manoj Kumar

9640987404, FPO coordinator

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment