about - కౌలు రైతులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించండి
ముఖ రాజకీయవేత్త, జాతీయ రైతు ఉద్యమ నాయకులు, భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్ ప్రొ. యోగేంద్ర యాదవ్ తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు డిమాండ్ ను బలంగా సమర్థిస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారితో కలిసి త
ప్రముఖ రాజకీయవేత్త, జాతీయ రైతు ఉద్యమ నాయకులు, భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్ ప్రొ. యోగేంద్ర యాదవ్ తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు డిమాండ్ ను బలంగా సమర్థిస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారితో కలిసి తక్షణం అమలు చేయాలని కోరారు. ప్రొ. కోదండరామ్ మరియు తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ప్రతినిధులు విస్సా కిరణ్ కుమార్, బి. కొండల్ మరియు కన్నెగంటి రవి బృందంతో బాటు ఆగస్టు 22వ తేదీన ప్రజా భవన్ లో యోగేంద్ర యాదవ్ గారు డిప్యూటీ సీఎంతో సమావేశం అయ్యారు. తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు కౌలు రైతుల ఇబ్బందులను తాను స్వయంగా తెలుసుకున్నట్టుతెలిపారు.

సెప్టెంబర్ 2023లో అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వంలో కౌలు రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి రైతు స్వరాజ్య వేదిక నిర్వహించిన బహిరంగ విచారణలో జూరీ సభ్యులుగా తాను ఉన్నప్పుడు కౌలు రైతుల గుర్తింపు తక్షణం జరగాలని 2011 సాగుదారుల చట్టాన్ని అమలు చేయాలని తాను అప్పుడే గట్టిగా డిమాండ్ చేసినట్టు యోగేంద్ర యాదవ్ గారు గుర్తు చేశారు. ఆ తరువాత అప్పటి కాంగ్రెస్ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు కౌలు రైతులకు హామీ ఇస్తూ ఒక బహిరంగ లేకుండా రాయడం కూడా రాయడం గురించి అప్పుడు సంతోషించాము అయితే ప్రభుత్వము ఏర్పడి రెండున్నరేళ్లు గడిచిన ఇంకా కౌలు రైతులకు గుర్తింపు కానీ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చిన 2011 చట్టాన్ని అమలు చేయడం కానీ ఇంకా ప్రారంభించకపోవడం చల్ల నిరాశను కలిగించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడైనా తక్షణం కౌలు రైతులకు గుర్తింపు మొదలుపెట్టి కనీసం వాళ్లకు సబ్సిడీ మీద ఎరువులు గాని పంట రుణాలు గానీ పంట అమ్ముకునే వ్యవస్థ కాని పంట నష్టపరిహారం కానీ ఇవన్నీ సాగు చేస్తున్న వాళ్లకే అందే విధంగా చూడాలని బలంగా కోరారు. కౌలు రైతులలో 90% పైగా ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీలే ఉండడము వారిని గుర్తించి న్యాయం చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తన సామాజిక న్యాయం అజెండాను ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన భాగంగా ఈ విషయాన్ని చూడాలని యోగేంద్ర యాదవ్ గారు అన్నారు.
తెలంగాణ రైతు కమిషన్ నుంచి కూడా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు 2011 చట్టం ప్రకారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కి లేఖ రాసింది, కాబట్టి దీనిని త్వరగా అమలు చేయడం అవసరం అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
సాధన కమిటీ తరఫున డిప్యూటీ సీఎంతో మాట్లాడుతూ విస్సా కిరణ్ కుమార్, కన్నెగంటి రవి మాట్లాడుతూ, కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ మరియు ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యున్నత అధికారులతో వివరంగా చర్చించిన తర్వాత ఏకాభిప్రాయము వచ్చినట్లు దాని ప్రకారం గుర్తింపు ప్రక్రియపై తాము ఒక నోట్ తయారు చేసినట్టు తెలిపారు. కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ పై తయారుచేసిన నోట్ కాపీని డిప్యూటీ సీఎంకు ఇచ్చారు. అలాగే తాము రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సర్వే రిపోర్ట్ ను డిప్యూటీ సీఎంకు సమర్పిస్తూ తాము సర్వే చేసిన 55 గ్రామాలలో కూడా కౌలు రైతులు ప్రభుత్వ గుర్తింపు లేక అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీలను నెరవేర్చునందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిపారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కగారు యోగేంద్ర యాదవ్,ప్రొ.కోదండరాం మరియు కౌలు రైతులకు గుర్తింపు సాధన కమిటీ చెప్పిన విషయాలకు స్పందిస్తూ, వారు చెప్పిన విషయాలన్నీ న్యాయమైనవని కౌలు రైతులకు గుర్తింపు విషయంపై తాను కూడా పూర్తిగా సమర్థిస్తున్నట్లు చెప్పారు. 2011 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సాగుదారుల చట్టం తెచ్చినప్పుడు తాను కూడా అసెంబ్లీలో ఉన్నట్లు, ఆ చట్టం తీసుకురావాల్సిన అవసరము మరియు కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియపై తనకు మంచి అవగాహన ఉన్నట్లు ఆయన తెలియజేశారు.తక్షణమే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ విషయంపై త్వరలో క్యాబినెట్ నిర్ణయం దిశగా చర్యలు తీసుకుంటామని కౌలు రైతులకు గుర్తింపు త్వరలోనే మొదలయ్యేటట్లు పూర్తి ప్రయత్నము చేస్తానని హామీ ఇచ్చారు.
No comments yet. Login to start a new discussion Start a new discussion