about - కిసాన్ మిత్రా ఫాలోఅప్ తో పెండింగ్ లో ఉన్న పశువుల కొట్టం చెల్లింపు పరిష్కారం
సమస్యను జిల్లా ప్రజావాణిలో నమోదు చేసి, పెండింగ్‌లో ఉన్న పశువుల కొట్టంకు చెల్లింపు అందేలా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. MPDO కార్యాలయం, పంచాయతీ సెక్రటరీతో కూడా చెల్లింపు పెండింగ్‌పై మాట్లాడి
వడ్డే మానెప్ప, అనంతమ్మ వికారాబాద్ జిల్లా, తాండూర్ మండలం, అనంతరం బుజుర్గ్ గ్రామానికి చెందిన వారు. జాబ్ కార్డ్ నంబర్ 230 - MGNREGA కింద సుమారు 7 నెలల క్రితం పశువుల కొట్టం నిర్మించుకున్నప్పటికీ, ఇప్పటివరకు డబ్బులు అందలేదని కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేసి తమ సమస్యను తెలియజేశారు. సంబంధిత సర్వేయర్ అధికారులుపశువుల కొట్టం పరిశీలించి,ఫొటోలు కూడా తీసుకున్నప్పటికీ తరువాత ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మానెప్ప తెలిపారు.
రైతు సమస్యను నమోదు చేసుకుని, సమస్య పరిష్కారం కోసం కిసాన్ మిత్ర ఫాలోఅప్ చేసింది. ఈ కేసు వివరాలను ఫీల్డ్ కో ఆర్డినేటర్ కు పంపించాం. వారు ఫీల్డ్ లెవెల్ లో కేసుని ఫాలోఅప్ చేసారు. సమస్యను జిల్లా ప్రజావాణిలో నమోదు చేసి, పెండింగ్‌లో ఉన్న పశువుల కొట్టంకు చెల్లింపు అందేలా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. MPDO కార్యాలయం, పంచాయతీ సెక్రటరీతో కూడా చెల్లింపు పెండింగ్‌పై మాట్లాడి, రైతుకు శాంక్షన్ అయిన మొత్తాన్ని అందజేయాలని ఫాలోఅప్ చేశాం.
రైతుకు 72,000 శాంక్షన్ అయిందని, ఆ మొత్తం పంచాయతీ సెక్రటరీ వద్ద పెండింగ్‌లో ఉందని, 2–3 రోజుల్లో అందజేస్తామని అధికారులు తెలిపినట్లు రైతు చెప్పారు. దీనిపై కిసాన్ మిత్ర టీం సభ్యులు అధికారులతో మాట్లాడారు. సమస్య పరిష్కారం అయిందా అని రైతును అడిగినప్పుడు సుమారు 8 రోజుల క్రితం పంచాయతీ సెక్రటరీ 72,000 మొత్తాన్ని తనకు అందజేశారని రైతు తెలిపారు.
తమ సమస్యపై అధికారులతో మాట్లాడి, జిల్లా ప్రజావాణిలో కూడా ఫిర్యాదు నమోదు చేసి ఫాలోఅప్ చేయడం ద్వారా సమస్య పరిష్కారం కావడంతో రైతు ఆనందం వ్యక్తం చేశారు.
N. Pranitha
8919684062, Counselor
No comments yet. Login to start a new discussion Start a new discussion