about - కిసాన్ మిత్ర సహకారంతో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబ పిల్లల చదువులకు భరోసా

మిషన్ వాత్సల్య పథకం: మిషన్ వాత్సల్య అనేది మహిళా, శిశు సంక్షేమం, అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకం. ఇది పిల్లల రక్షణ, పునరావాసం, సంక్షేమంపై దృష్టి పెడుతుంది.

 · 2 min read

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు  పిట్టగూడ గ్రామానికి చెందిన  అర్కా రామ్ షావ్ అనే యువ రైతు డిగ్రీ వరకు చదువుకొని,  భార్యతో కలిసి 3 ఎకరాలలో  వ్యవసాయం చేసేవాడు. ఈ క్రమంలో  మతిస్థిమితం కోల్పోయి, పురుగుల మందు తాగి 2020 సెప్టెంబర్ 26 న  ఆత్మహత్య చేసుకున్నాడు.

కుటుంబ సభ్యులు:  భార్య అర్కా భగీరథ బాయి, వ్యవసాయ కూలి , పిల్లలు అర్క శివాని 2వ తరగతి, అర్క అక్ష. UKG చదువుకుంటున్నారు.

కిసాన్ మిత్ర కార్యకర్తగా పని చేస్తున్న నాకు ఈ కుటుంబ పరిస్థితి దృష్టికి వచ్చింది. ఈ కుటుంబానికి తగిన సహకారం అందించాలనే ఉద్దేశ్యంతో  ప్రయత్నాలు చేశాను.

మిషన్ వాత్సల్య పథకం: మిషన్ వాత్సల్య అనేది మహిళా, శిశు సంక్షేమం, అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకం. ఇది పిల్లల రక్షణ, పునరావాసం, సంక్షేమంపై దృష్టి పెడుతుంది. అవసరంలో ఉన్న పిల్లలకు (CNCP), చట్టంతో సంఘర్షణ (CCL) ఉన్న పిల్లలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన బాల్యాన్ని అందించడం, కుటుంబ ఆధారిత సంస్థాగతేతర సంరక్షణ, పిల్లల హెల్ప్‌లైన్ సేవలకు మద్దతు ఇవ్వడం, జువెనైల్ న్యాయ వ్యవస్థను  బలోపేతం చేయడం ఈ పథకం  లక్ష్యం.ఈ పథకం రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల  పిల్లల చదువులకు ఆసరాగా ఉంటుందని భావించి, అన్ని విధాలుగా కిసాన్ మిత్ర తరపున పిల్లల కులం, ఆదాయం, అంగన్వాడీ నుండి  ధ్రువీకరణ పత్రాలు సేకరించాను. తల్లి, కూతురు పేరుతో జాయిట్ అకౌంట్ ను బ్యాంక్  మేనేజర్ తో మాట్లాడి ఓపెన్ చేశాము.  జైనూర్ మండలం శిశు సంక్షేమ అధికారిణి  ఇందిరా (సీడీపీఓ),  ICDS అధికారి శ్రవణ్  గారితో చర్చించాము.  

మిషన్ వాత్సల్య పథకం  క్రింద పిల్లల చదువుకు అందించే  4000 రూపాయల స్కాలర్ షిప్ కోసం ICDS కార్యాలయంలో  దరఖాస్తు ఇచ్చాం. ఒక సంవత్సరం పాటు, వివిధ స్థాయిల అధికారులతో మాట్లాడుతూ ఈ కుటుంబానికి సహాయం అందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరాను.  నా ప్రయత్నం ఫలించింది.

2025 సంవత్సరం నుండి అర్కా అక్ష అనే అమ్మాయికి నెల నెలా చదువు కోసం   4000 రూపాయలు జాయింట్ అకౌంట్ లో జమ అవుతున్నాయి. అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలు నిండే వరకు చదువు కొనుటకు ఈ స్కాలర్ షిప్  వస్తుంది. గత తొమ్మిది నెలల కాలంలో 36,000 వేలు స్కాలర్ షిప్ అందిందని  అర్క భగీరథ తెలిపారు. పెండింగ్ అమౌంట్ కూడా త్వరలో అందుతాయని అధికారులు చెప్పారు.

ఒక కిసాన్ మిత్ర కార్యకర్తగా రైతు ఆత్మహత్య కుటుంబ పిల్లల చదువులకు సహాయం చేసినందుకు సంతోషంగా ఉంది. నిజానికి ఈ కుటుంబం రైతు కుటుంబమే.  వ్యవసాయం చేసేవారు. కానీ  ఆత్మహత్య  సందర్భంగా రాసిన  FIR రిపోర్టులో వ్యవసాయం గురించి ఎక్కడా  ప్రస్తావించలేదు. వాస్తమానసికంగా మతిస్థితం కోల్పోయి ఉండే అని భార్య చెప్పడంతో, FIR లో కూడా మతిస్థిమితం లేకుండా ఊరిలో తిరుగుతుండేవాడని రాశారు. ఆ కుటుంబానికి అందాల్సిన వితంతు పింఛన్ కోసం కూడా  దరఖాస్తు పెట్టాము.


Kanaka. AnandaRao

Kisanmitra, Asifabad field coordiantor 9493752633

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment