about - కిసాన్ మిత్ర సహకారంతో భూమికి పట్టా సాధించుకున్న కుటుంబం
2025 ఫిబ్రవరి నెలలో వరి పొలానికి మందు కొట్టి స్ప్రేయర్ ను పాడు చేశాడని ఇష్ట మొచ్చినట్టు తిడుతూ చెప్పుతో కొడతానని భూ యజమాని కుటుంబం దుర్భాషలాడింది. ఇంట్లోనే ఇష్టం వచ్చినట్లు తిట్టి, కొట్టడం తో అవమానం
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం, మంగన పల్లి గ్రామానికి చెందిన నాయిన ఎల్లక్క భూమి సమస్య కిసాన్ మిత్ర సహకారంతో పరిష్కారమయ్యింది.
నాయిని ఎల్లక్క కు భర్త, ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మొదటి కొడుకు నాయిని కన్నయ్య గత కొన్ని సంవత్సరాలుగా ఎనగంటి చిన్నన్న అనే ఆధిపత్య కులానికి చెందిన భూస్వామి దగ్గర గత ఆరు సంవత్సరాలుగా పాలేరు గా పని చేస్తున్నాడు.
2025 ఫిబ్రవరి నెలలో వరి పొలానికి మందు కొట్టి స్ప్రేయర్ ను పాడు చేశాడని ఇష్ట మొచ్చినట్టు తిడుతూ చెప్పుతో కొడతానని భూ యజమాని కుటుంబం దుర్భాషలాడింది. ఇంట్లోనే ఇష్టం వచ్చినట్లు తిట్టి, కొట్టడం తోఅవమానం భరించలేని చిన్నన్న ఇంట్లో ఉన్న గడ్డి మందు డబ్బా తీసుకొని తాగాడు.
ఏప్రిల్ 4 న మధ్యాహ్నం 12 గంటలకు గడ్డి మందు తాగాడు. దగ్గర ఉన్న వాళ్ళు చూసి అంబులెన్స్ కు ఫోన్ చేసి చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం నడుస్తుండగానే చనిపోయాడు.
నాయిని వెంకటి కి వేమనపల్లి గ్రామ శివారులో సర్వే నెంబరు 464/2 లో విస్తీర్ణం 1-00 ఒక్క ఎకరం సీలింగ్ పట్టా భూమి ఉంది. నాయిని కన్నయ్య మరణించిన తర్వాత నాయిని ఎల్లక్క కు సర్వే నెంబరు ఒక్క ఎకరం సీలింగ్ భూమి పట్టా విరాసత్ అయింది, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2017, 2018 సంవత్సరాలలో క్రాప్ లోను తీసుకున్నారు. లోను కట్టుకున్నారు.
2019 లో నాయిని ఎల్లక్క మళ్ళీ బ్యాంకుకు వెళ్లి లోన్ ఇవ్వమంటే సర్వే నెంబర్ 464 /2 సీలింగ్ భూమి ఎనగంటి హరీష్ S/o చిన్నన్న( OC కులం ) పేరు మీదికి మారింది కాబట్టి క్రాప్ లోను ఇవ్వలేమని చెప్పారు.
ఎనగంటి హరీష్ ను మాభూమి మీ పేరు మీదికి పట్టా అయింది, మాకు మళ్ళీ పట్టా కావాలని అడిగితే పట్టించుకోకుండా తిప్పుకున్నారు.

2019 నుండి 2025 వరకు రైతు భరోసా మొత్తం కూడా హరీష్ బ్యాంక్ అకౌంట్ లోనే పడ్డాయి. ఇప్పటికీ సాగులో మాత్రం నాయిని ఎల్లక్క కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు.
ఎనగంటి హరీష్ S/o చిన్నన్న పేరు మీద అయినా మా భూమి పట్టాను మా పేరు మీద మార్చాలని, నీల్వాయి పోలీస్ స్టేషన్లో, వేమనపల్లి మండలం తహసిల్దార్ కార్యాలయంలో 2025 ఏప్రిల్ 7 న రోజున దరఖాస్తు పెట్టారు.
నాయిన కన్నయ్య అగ్ర కుల భూస్వామి చేతిలో మరణించిన తర్వాత కిసాన్ మిత్ర కు ఫోన్ చేసి చెప్పారు. డాక్యుమెంట్స్ పేపర్ స్టేట్మెంట్లన్నీ పరిశీలించాము. ఏప్రిల్ 7 న DBF జాతీయ కార్యదర్శి శంకరన్న సహకారంతో, మాట్లాడిSC, ST కమిషన్ ఛైర్మన్ భట్టి వెంకటయ్య గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ కుటుంబానికి న్యాయం జరగాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం, CPM సంస్థల నాయకులు కూడా ఈ విషయమై ఆందోళన నిర్వహించారు.
మే 27 న కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ సహకారంతో, ప్రజావాణి నోడల్ అధికారికి మరోసారి వినతి పత్రం ఇచ్చారు. ఆమె మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడి మండల ఎమ్మార్వో కు సమస్య పరిష్కారానికి అప్పగించారు.
మే 28 న ఎనగంటి హరీష్ పేరు మీద ఉన్న పట్టా క్యాన్సిల్ చేసి నాయిని ఎల్లక్క W/o వెంకటి పేరు మీద మీ సేవలో అప్లికేషన్ పెట్టించాం.
చివరికి 2025 జులై లో వేమనపల్లి మండలం తహసీల్దారు కార్యాలయ తహసిల్దార్ ఫోన్ చేసి పట్టా పాస్ బుక్ ప్రింట్ తీసి ఫోటో తీసుకోమని ఇచ్చారు, బుక్ ప్రింట్ అయి పోస్ట్ ద్వారా ఇంటికి వస్తుందని చెప్పారు.
కిసాన్ మిత్రా హెల్ప్ లైన్ కు ఫోన్ చేయడం వలన తమకు భూమి పట్టా పాస్ బుక్ వచ్చిందని రైతు కుతూమాబం సంతోషం వ్యక్తం చేసింది.
Sidam. Ramesh
7702213236, Mancheriyal, Field Coordinator
No comments yet. Login to start a new discussion Start a new discussion