about - కిసాన్ మిత్ర సహకారంతో భూమి దక్కించుకున్న కుటుంబం
కొమ్ముల రాధకు ఉమ్మడి రాష్ట్రంలో 7వ విడత భూపంపిణీ లో ఈ భూమికి అసైన్డ్ పట్టా ఇచ్చారు. 2-3 సంవత్సరాలు ఆ భూమిలో పంటలు సాగు చేశారు. 2015 సంవత్సరం లో రెవిన్యూ అధికారులు ఆ భూమిలో ఎవరు పంటలు సాగు చేయడం లేద
ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం పాలోది గ్రామానికి 2025 మార్చ్ 20న ప్రజల నుండీ ప్రజావాణి గ్రీవెన్స్ తీసుకోవడానికి, ఆ గ్రామ సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళాను.
ఈ గ్రామానికి చెందిన కొమ్ముల రాధ కు గ్రామ శివారు లోని సర్వే నెంబర్ 102/12 లో ప్రభుత్వం ఇచ్చిన 2 ఎకరాలసాగు భూమి ఉంది. ఆ భూమిలో తాను పంట సాగు చేయడానికి వెళ్తే, కప్పర్ల గ్రామానికి చెందిన అభయ్ కుమార్ అనే వ్యక్తి తనను భూమిలోకి రానివ్వడం లేదని కిసాన్ మిత్ర కు చెప్పింది. అభయ్ కుమార్ ఎక్స్ సర్వీస్ మెన్.
కొమ్ముల రాధకు ఉమ్మడి రాష్ట్రంలో 7వ విడత భూపంపిణీ లో ఈ భూమికి అసైన్డ్ పట్టా ఇచ్చారు. 2-3 సంవత్సరాలు ఆ భూమిలో పంటలు సాగు చేశారు. 2015 సంవత్సరం లో రెవిన్యూ అధికారులు ఆ భూమిలో ఎవరు పంటలు సాగు చేయడం లేదని భావించి, ex సర్వీస్ మెన్ అభయ్ కుమార్ కు అదే భూమిని కేటాయించారు. ఈ విషయం తెలిసిన కొమ్ముల రాధ, ఈ భూమి ఆయనకు కేటాయించవద్దనీ, తామే ఆ భూమిని దున్నుకుంటున్నామనీ, అధికారులకు దరఖాస్తులు ఇచ్చారు. కానీ ఎవరూ ఆమె మాటను పట్టించుకోలేదని మా దృష్టికి తెచ్చారు.
2018 లో ex సర్వీస్మెన్ కి 5 ఎకరాల భూమికి పట్టా ఇచ్చామని అధికారులు అంటున్నారు. అప్పటి నుండి కొమ్ముల రాధ కుటుంబం ఈ సమస్య పరిష్కారానికి అధికారుల చుట్టూ తిరుగుతున్నది. మాకు అదే భూమికి పట్టా ఇచ్చారు. ఇప్పుడు ఆ భూమిలోకి వెళ్తే రానివ్వడం లేదని అధికారులను కలసి వివరించారు. తాము చూసినప్పుడు ఈ భూమిలో ఎవరూ కాస్తులో లేరని, అందువల్ల ఆ భూమిని వేరే వాళ్ళకి కేటాయించమని అధికారుల వాదన. ఆ కుటుంబంతో ఆ విషయం చెప్పినప్పుడు, మేము ఆరోగ్యం బాగాలేక ఆ ఒక్క సంవత్సరం మాత్రమే ఆ భూమి సాగు చేసుకోలేకపోయాం, ఇప్పుడు సాగు చేసుకుందామంటే మాకు ఇవ్వడం లేదనీ, మాకు ఈ భూమి తప్ప వేరే ఆస్తి లేదనే వాపోతున్నారు.
ఇటీవలి కాలంలో కిసాన్ మిత్ర తరపున ప్రజావాణి లో ఈ సమస్య తీసుకెళ్లిన తరవాత అధికారులు వచ్చి వీళ్లకి భూమి చూపించారు. 2025 లో సమస్య పరిష్కారమైంది. ప్రస్తుతం ఈ కుటుంబం భూమిని సాగు చేసుకుంటున్నది.

M. Ramakanth
Kisan Mitra Adilabad Field Coordinator
No comments yet. Login to start a new discussion Start a new discussion