about - కిసాన్ మిత్ర జోక్యంతో రైతుల వ్యవసాయ విద్యుత్ సమస్య పరిష్కారం

కిసాన్ మిత్ర వికారాబాద్‌ జిల్లా లో వ్యవసాయ విద్యుత్ సమస్య పరిష్కారం-సక్సెస్ స్టోరీ

 · 1 min read

వికారాబాద్‌ జిల్లా మొమిన్ పేట మండలం యెంకతాల గ్రామానికి చెందిన కమ్మరి పాండు రంగాచారి  కిసాన్‌ మిత్ర హెల్ప్‌లైన్‌ కు ఫోన్ చేసి “కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో  నిర్మిస్తున్న హై వోల్టేజ్‌ కరెంట్‌ టవర్‌ నిర్మాణం కోసం తన పొలంలో 5 గుంటల భూమి తీసుకున్నారనీ, తనకు ఇప్పటివరకూ ఎటువంటి పరిహారం (కాంపెన్సేషన్‌) ఇవ్వలేదనీ,  టవర్‌ నిర్మాణం కూడా పూర్తి చేయకుండా బేస్మెంట్‌ వేసి వదిలేశారనీ,  ఇదే విషయంలో ఇతర రైతులకు పరిహారం అందినా, తనకు మాత్రం పరిహారం అందలేదనీ  తెలిపారు.

జిల్లా కిసాన్‌ మిత్ర బృందం ఈ అంశంపై వెంటనే స్పందించి విద్యుత్‌ శాఖ సూపర్వైజర్‌ శేషగిరి రావు ను  సంప్రదించింది. టవర్‌ నిర్మాణం కోసం బోయ అంజయ్య, కమ్మరి పాండు రంగాచారి, కమ్మరి శ్రీనివాస్‌ అనే ముగ్గురు  రైతుల భూములు అవసరమని ఆయన చెప్పారు.  మొత్తం భూమికి 10,62,686 రూపాయల పరిహారం నిర్ణయించబడింది. ఇందులో మొదటి విడతగా 50 శాతం 5,31,343 రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాలలో జమయ్యాయనీ, మిగిలిన 50 శాతం పరిహారం చెల్లిస్తామని చెప్పారు. టవర్‌ పొడవు 24 మీటర్లు, వెడల్పు 19 మీటర్లు ఉంటుందని తెలిపారు. అలాగే ఈ ప్రక్రియలో పంట నష్టపోయిన రైతులకు  ప్రత్యేక పరిహారం అందజేయనున్నట్లు కూడా చెప్పారు.

కిసాన్‌ మిత్ర జోక్యంతో సమస్య పరిష్కారం అయినందుకు రైతులు సంతోషించారు. “కిసాన్‌ మిత్ర జోక్యం చేసుకోకపోతే,  ఈ విషయం పరిష్కారం అయ్యేది కాదని రైతు పాండు రంగాచారి  అభిప్రాయపడ్డారు. కిసాన్‌ మిత్ర జోక్యంతో  రైతులకు పరిహారం పూర్తిగా అంది, టవర్‌ నిర్మాణాన్ని  రైతుల సమ్మతితో పూర్తిచేశారు.

J. Narsimhulu

Kisan MItra Vikarabad Field Coordinator

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment