about - కిసాన్ మిత్ర చొరవతో రైతుల నుండీ జొన్న కొనుగోలు గడువు పొడిగింపు

వికారాబాద్ జిల్లాలో 2025 మే 8 నుండీ మార్క్ ఫెడ్ సంస్థ జొన్న కొనుగోలు ప్రారంభించింది. జొన్న కొనుగోలుకు 2025 మే 31 చివరి తేదీ అని కూడా ప్రకటించింది. క

 · 1 min read

వికారాబాద్ జిల్లాలో 2025 మే 8 నుండీ మార్క్ ఫెడ్ సంస్థ జొన్న కొనుగోలు ప్రారంభించింది. జొన్న కొనుగోలుకు  2025 మే 31  చివరి తేదీ అని కూడా ప్రకటించింది. కానీ  ఈ సమయానికి  రైతుల జొన్న పంట కోత పూర్తి కాక పోవడం వల్ల చాలా మంది రైతులు   తమపంటను కొనుగోలు కేంద్రాలకు తగిన సమయంలోతేలేక పోయారు


కిసాన్ మిత్ర ఫీల్డ్ కో ఆర్డినేటర్లు ఈ సమస్యపై గ్రామాలకు వెళ్లి పరిశీలించారు. రైతులతో చర్చించి విషయాలు తెలుసుకున్నారు.అప్పటికి  ఇంకా చాలా  వరకూ పంట కోత పూర్తవ్వలేదని అర్థమైంది. రైతులు కూడా కిసాన్ మిత్ర  హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి జొన్న కొనుగోలు గడువు పొడగించేలా అధికారులతో మాట్లాడమని కోరారు.

ఈ అంశంపై ఆయా కొనుగోలు కేంద్రాల బాధ్యులతో కిసాన్ మిత్ర సెంట్రల్ టీం ఫోన్ చేసి మాట్లాడింది.  ఫీల్డ్ కో ఆర్డినేటర్ లు  కూడా నేరుగా సెంటర్ ల దగ్గరికి వెళ్లి మాట్లాడారు.  ఈ సమస్యపై మార్క్ ఫెడ్  సంస్థ డిస్ట్రిక్ట్ మేనేజర్ గారితో మాట్లాడి కొనుగోలు తేది పొడిగింపు అవకాశాల గురించి తెలుసుకున్నారు.

రాష్ట్ర స్థాయి లో దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మార్క్ ఫెడ్ జిల్లా అధికారి జవాబిచ్చారు. జిల్లాలో జొన్న రైతులందరి వివరాలను నమోదు చేసుకొని జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి సమస్య తీసుకెళ్ళి కిసాన్ మిత్ర టీం చర్చించింది. ఫలితంగా జొన్న కొనుగోలు గడువు  4 రోజులు పొడగించారు.  ఈ విషయాన్ని అన్ని మండలాల్లో రైతులకు కిసాన్ మిత్ర టీం ఫోన్ ద్వారా  తెలియజేసి, వెంటనే పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలని  చెప్పింది.  ఈ నాలుగు

రోజుల్లో రైతులందరూ తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి అమ్ముకోగలిగారు.

రైతులు పంటను అమ్ముకున్నప్పటికీ, పంట అమ్మిన డబ్బులు రైతులకు అందాకా పోవడంతో రైతులు మళ్ళీ కిసాన్ మిత్రకు ఫోన్ చేశారు.

2025 జూలై 16న కిసాన్ మిత్ర టీం  ఈ విషయాన్ని మార్క్‌ఫెడ్  జిల్లా అధికారుల దృష్టికి  తీసుకు వెళ్ళింది.  ప్రభుత్వం ఇటీవలే చెల్లింపు ఆదేశాలు విడుదల చేసినట్లు తెలియజేసి, ఒక వారం లోపు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని హామీ ఇచ్చారు. జొన్న అమ్మిన డబ్బులు వారం రోజుల్లోనే తమ ఖాతాల్లో జమయ్యాయని రైతులు ధృవీకరించి, కిసాన్ మిత్రకు ధన్యవాదాలు తెలిపారు.




Katta. Navaneetha

KisanMitra, Coordinator

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment