about - కిసాన్ మిత్ర చొరవతో పరిష్కారమైన భూమి సమస్య

ప్రభాకర్ చాలాసార్లు ఎమ్మార్వో ఆఫీస్ కు తిరిగి మీరు చేసిన కంప్యూటర్ మిస్టేక్ వల్ల నాకు పొలము రిజిస్ట్రేషన్ అయి కూడా పాస్ బుక్ రావడంలేదని చెప్పినా, దానిని సరి చేయడానికి ఆఫీసు సిబ్బంది డబ్బులు అడుగుతూ వ

 · 2 min read

వికారాబాద్ జిల్లా, యాలాల మండలము జుంటిపల్లి గ్రామానికి చెందిన రైతు రాళ్లపేట ప్రభాకర్ భూమి సమస్య ఇది. ఈ రైతు  3,  4 సంవత్సరాల నుంచి ఎమ్మార్వో ఆఫీస్ లో చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు.

వీరికి  తన తాత గారి నుండీ  రెండెకరాల ఆరు గుంటల పొలం వారసత్వంగా వచ్చింది. ప్రభాకర్  ఈ పొలమును తన పేరు మీద,  తన  తమ్ముని పేరు మీద  ఒక ఎకరం  మూడు గుంటల చొప్పున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.  

ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లి రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ పేపర్లు ఎమ్మార్వో గారికి చూపించారు. దీనిలో ఆఫీస్  సిబ్బంది నిర్లక్ష్యంతో,  ఆన్లైన్లో ఫీడ్ చేసే టైంలో కోర్టు కేసు అని నమోదు చేశారు.  

రాళ్లపేట ప్రభాకర్ చాలాసార్లు ఎమ్మార్వో ఆఫీస్ కు తిరిగి మీరు చేసిన కంప్యూటర్ మిస్టేక్ వల్ల నాకు పొలము రిజిస్ట్రేషన్ అయి కూడా పాస్ బుక్ రావడంలేదని చెప్పినా,  దానిని సరి చేయడానికి ఆఫీసు సిబ్బంది డబ్బులు అడుగుతూ వచ్చారు.

కిసాన్ మిత్ర టీం నుండీ యాలాల మండలం ఫీల్డ్ కు వెళ్లినప్పుడు ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఆయన చాలా బాధపడుతూ తన  సమస్యను చెప్పారు.  కిసాన్ మిత్ర  కాల్ సెంటర్ కు ఫోన్ చేయమని చెబితే, ఆయన హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి సమస్యను వివరించారు. రాళ్లపేట ప్రభాకర్ గారికి మనము కిసాన్ మిత్ర తరపున చాలాసార్లు ఆర్ఐ గారిని ఎమ్మార్వో గారిని ప్రతి ఒక్కరిని రాత పూర్వకంగా ప్రయత్నం చేశాం.



కానీ ఎమ్మార్వో, ఆర్ఐ  ఎవరూ  సరిగా  స్పందించ లేదు.  రాళ్లపేట ప్రభాకర్ తో  వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో లెటర్ కూడా ఇప్పించాం.

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి యాలాల ఎమ్మార్వో కు  ఫోన్ చేసి రైతు సమస్య పరిష్కరించండని ఆదేశించారు. ఎమ్మార్వో  పట్టించుకోలేదు. మళ్లీ మనం డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో కిసాన్ మిత్ర రాష్ట్ర కార్యాలయం నుండీ  రాళ్లపేట ప్రభాకర్ సమస్యను  సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళాం.

ఆర్డిఓ యాలాలు ఎమ్మార్వో  ఈ రైతు సమస్యపై గట్టిగా చెప్పడంతో ఆయన ఈ విషయాన్ని మండలంలో ప్రక్రియ  పూర్తి చేసి ఆర్డిఓ ఆఫీస్ కు  పంపించారు. ఆర్ డి ఓ ఆఫీస్ లో ప్రభాకర్  కోర్టు కేసుని ఆన్లైన్లో తొలగించి వారికి కొత్త పాస్ బుక్  ఇప్పించారు.

తన సమస్య పరిష్కారం కావడంతో, రాళ్లపేట ప్రభాకర్  చాలా సంతోషపడ్డారు.




K. Karunanidhi

8500650321, Field Coordinator, Vikarabad

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment