about - కిసాన్ మిత్ర చొరవతో పత్తి పంట అమ్ముకొన్న రైతు
పత్తి పంటను అమ్ముకోలేక తీవ్ర నిరాశకు గురై, కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్ కు కాల్ చేశారు. ఆయన సమస్యను వెంటనే నమోదు చేసి, ఫీల్డ్ కో ఆర్డినేటర్ రమాకాంత్ గారికి సమాచారం పంపించాము.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం తలమడుగు గ్రామం నుండి పవన్ అనే రైతు పత్తి పంటను అమ్ముకోవడానికి చాలా రకాల ఇబ్బంది పడి తన పంటను అమ్ముకోలేక పోయారు. తన ప్రతి పంటను అమ్ముకోవడానికై జై గురుదేవ్ మిల్ కి వెళ్లారు. అక్కడ తన పత్తి పంటను అమ్ముకోలేక తీవ్ర నిరాశకు గురై, కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్ కు కాల్ చేశారు. ఆయన సమస్యను వెంటనే నమోదు చేసి, ఫీల్డ్ కో ఆర్డినేటర్ రమాకాంత్ గారికి సమాచారం పంపించాము. ఆయన తక్షణమే స్పందించి, జైగురుదేవ్ కొనుగోలు కేంద్రానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.
అక్కడి అధికారులు పత్తి పంట నాణ్యత బాగోలేదని చెప్పి కొనుగోలు చేయడానికి నిరాకరించారు.
దీనిపై కిసాన్ మిత్ర సెంట్రల్ టీం అసిస్టెంట్ మేనేజర్ తోమాట్లాడారు, “క్వాలిటీ సరైన స్థాయిలో లేకపోతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేయలేము. ఒకవేళ తీసుకున్నా, ఆ పంటను ఇతర రాష్ట్రాలకు పంపడం కూడా కష్టమవుతుంది” అని తెలిపారు. మళ్ళీ మార్కెట్ CPO తో కూడా మాట్లాడి, రైతు పత్తి పంటను కొనుగోలు చేయాలని కోరాము. రైతు అభ్యర్థనను,మన ప్రయత్నాన్ని పరిగణన లోకి తీసుకున్న అధికారులు, పత్తి పంటను రేపు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
నేను కిసాన్ మిత్ర సహకారంతో పత్తిని అమ్ముకున్నాను, కిసాన్ మిత్ర టీంకు ధన్యవాదాలు చెప్పారు.

N. Pranitha
8919684062, Counselor
No comments yet. Login to start a new discussion Start a new discussion