about - ఎద్దు మరణం - కిసాన్ మిత్ర సహాయంతో ఆర్థిక సహాయం
ఎద్దు మరణం - కిసాన్ మిత్ర సహాయంతో ఆర్థిక సహాయం
ఇంద్రవెల్లి మండలం గట్టేపల్లి గ్రామం కుమ్ర మోహన్ రావ్ అనే రైతు తన ఎద్దును తన వ్యవసాయ చేనులో మేతకి తీసుకెళ్లారు. ఇంటికి వచ్చిన ఎద్దు అకస్మాత్తుగా చనిపోయింది.
కిసాన్ మిత్ర కి కాల్ చేసి రైతు తన బాధను తెలిపాడు. నేను ఆ కుటుంబ వివరాలు సేకరించి గ్రామ పంచాయతీ కార్యదర్శి గారితో మాట్లాడి ఎద్దు చనిపోయినట్టు ధృవీకరణ పత్రం జారీ చేయించాను.
వెటర్నరీ డాక్టర్ గారితో మాట్లాడి , డాక్టర్ ఎద్దు చనిపోయిన కారణాలు తెలుసుకోని ఆ ఎద్దు విలువ అంచనా వేసి ధృవీకరణ పత్రం రాసి ఇచ్చారు. ITDA PO గారికి కూడా ఈ విషయంపై దరఖాస్తు చేయించాము.

దరఖాస్తును పరిశీలించి ఐటీడీఏ పీఓ గారు, ప్రాసిడింగ్ కాపీ తయారు చేసి ఇంద్రవెల్లి మండలం MRO గారికి ఫార్వర్డ్ చేశారు. మండల RI గ్రామంలోకి వెళ్ళి నిజ నిర్ధారణ చేసి నలుగురు పంచుల సమక్షంలో తీర్మానం చేసి MRO గారికి సమర్పించారు. MRO గారు నష్టపరిహారం గా 25,000 రూపాయలు మంజూరు చేయవచ్చని లెటర్ ఐటీడీఏ పీఓ గారికి రాసి పంపారు.తర్వాత ఐటీడీఏ APO (G) గారు నిర్ధారించి చెక్ రూపంలో 25,000 రూపాయలు రైతుకి అందచేశారు.
కిసాన్ మిత్ర టీం సభ్యులకి రైతు ధన్యవాదాలు తెలిపారు.
Kumra. Vinayak Rao
Kisan Mitra Adilabad Field Coordinator, 94937 76805
No comments yet. Login to start a new discussion Start a new discussion