about - ఇప్పటికీ అటవీ హక్కు పత్రాలు అందుకోని కోనంపేట గ్రామపంచాయతీ పాటిగూడెం కులానికి చెందిన పోడు రైతులు
కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ నుండీ మేము ఒక బృందంగా ఉట్నూర్ ఐటిడిఏ అధికారులను కలిశాము. ITDA AO కు దరఖాస్తు ఇచ్చి చర్చించాము.
మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండలం కోణంపేట గ్రామం పాటిగూడెం PVTG ఆదివాసీ కొలవార్ కులానికి చెందిన 14 కుటుంబాలకు చెందిన వారు (1, మంజరి ధర్మయ్య, 2 సోపిరి మల్లేష్, 3 బండి శంకర్, 4 సోపిరి చిన్నక్క, 5 రెడ్డి మల్లేష్, 6 మంజరి లక్ష్మి, 7 మంజరి చిన్నయ్య 8 మంజరి భీమేష్, 9 మంచిరి బానేష్, 10 మంచాల లక్ష్మయ్య, 11 మంచాల శ్రీనివాసు, 12 రెడ్డి పోశయ్య, 13 సోపిరి బాపు, 14 పసల తిరుపతి), 1985-90 సంవత్సరం మధ్యకాలం వేమనపల్లి మండలం, ఫారెస్ట్ రెంజ్ నీల్వాయి, చామనపల్లి గ్రామపంచాయతీ పరిధిలో అటవీ భూమిని పోడు కొట్టి వ్యవసాయం సాగు చేస్తున్నారు. 2007-08 సంవత్సరంలో అటవీ భూములను ROFR సర్వే చేయాలనే అవగాహన లేకపోవడంతో దరఖాస్తులు చేసుకోలేకపోయారు. 14 కుటుంబాల వారు పోడు కోట్టిన ప్రాంతంలో వేమనపల్లి మండలం, చామనపల్లి గ్రామానికి చెందిన, ST ఆదివాసీ కొలవార్, BC గొల్లలు, SC నేతకాని, కోనంపేట గ్రామానికి చెందిన SC నేతకాని, కృష్ణ పల్లి గ్రామానికి చెందిన SC నేతకాని కులాలకు చెందిన వారు అడవిని కొట్టి కొన్ని సంవత్సరాలు ఉమ్మడి వ్యవసాయం చేశారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా ఎవరిది వాళ్ళు సాగు చేసుకున్నారు. పాటిగూడెం కు చెందిన వారు అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం ROFR సర్వే చేయాలని దరఖాస్తు చేసుకోలేకపోవడం వల్ల వారికి ROFR హక్కు పత్రాలు రాలేదు.అటవీ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఆదివాసి గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు, లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ జనసమితి పార్టీలు ఐక్య ఉద్యమాలు సాగించాయి. అటవీ భూమిని సాగు చేసుకుంటున్న రైతులందరికీ అటవీ భూమికి హక్కు పత్రాలు ఇవ్వాలని 2020 అక్టోబర్ 5న పోడు రైతు పొలికేక పేరుతో రాస్తా రోకోకు పిలుపు ఇచ్చాయి. ఈ ఉద్యమానికి రాష్ట్ర కన్వీనర్‌గా ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వం వహించారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో రోడ్డు, రాస్తారోకోలు చేయడం వలన BRS ప్రభుత్వం 2021-22లో అటవీ భూములకు ROFR సర్వే చేసి హక్కు పత్రాలు ఇస్తామని జీవో జారీ చేసింది. ఈ జీవో మేరకు కోనంపేట గ్రామపంచాయతీ, పాటిగూడెం కు చెందిన 14 కుటుంబాల వారు చామనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయానికి ROFR సర్వే చేయాలని అటవీ హక్కుల కమిటీ దగ్గరికి దరఖాస్తులు పెట్టుకోవడానికి వెళ్లారు, చామనపల్లి గ్రామానికి చెందిన BC ( గొల్ల), SC ( నేతకానీ) కులాలకు చెందిన వారు, “మా చామనపల్లి గ్రామపంచాయతీ హద్దులో ఉన్న అటవీ భూమి మాకే దక్కాలని, మాకే పట్టాలు ఇవ్వాలని, మీ గ్రామం దగ్గర లో అటవీ భూమి ఉంటే మళ్ళీ కొట్టుకొమ్మని, వ్యవసాయం చేయడానికి దరఖాస్తులు చేసుకోమని” చెప్పి, దరఖాస్తులు పెట్టకుండా అడ్డుకొని గొడవ చేశారు.
ROFR సర్వే చేయాలని 14 కుటుంబాల వారు వేమనపల్లి మండలం తహసిల్దార్ కార్యాలయం వెళ్లి మరోసారి దరఖాస్తులు చేసుకున్నారు. రసీదులు తీసుకున్నారు. ROFR సర్వే లిస్టులో పేర్లు వచ్చినప్పటికీ ఫారెస్ట్ అధికారులు సర్వే చేయలేకపోయారు. చామనపల్లి గ్రామస్తులు సర్వే చేయకుండా అడ్డుకున్నారు. మా పరిధిలో ఉన్న అటవీ భూములు మాకే దక్కాలి. పట్టాలు హక్కు పత్రాలు ఇవ్వాలని సర్వే సమయంలో బీసీలు, ఎస్సీలు ఆందోళన చేశారు. వేమనపల్లి మండలం పోలీస్ స్టేషన్ నీల్వాయి వెళ్లి కేసు పెట్టారు. చెన్నూర్ రూరల్ సీఐ, నీల్వాయి ఎస్ఐ భూముల మీదికి వెళ్లి చామనపల్లి గ్రామస్తులను, కోనంపేట గ్రామస్తులను పిలిపించారు.
పోలీస్ అధికారులు చామనపల్లి గ్రామస్తులను మీ భూముల మీద వెళ్లి నిలబడమంటే వాళ్ళు నిలబడలేకపోయారు. అటవీ హక్కుల కమిటీ చైర్మన్ కొమిరెల్లి మొండిగారు చెప్పడంతో పాటిగూడెం వారు వాళ్ళ భూముల మీద వెళ్లి నిలబడ్డారు. కానీ ఫారెస్ట్ అధికారులు సర్వే చేయకపోవడం వలన 2022-23 సంవత్సరంలో ROFR హక్కు పత్రాలు రాలేదు.
కోనంపేట గ్రామస్తులు వ్యవసాయ పంటలు వేస్తే చామనపల్లి గ్రామస్తులు వాళ్ళ గేదెలను తీసుకెళ్లి మేపారు. ట్రాక్టర్ పెట్టి పంటలను దున్నే ప్రయత్నం చేయడంతో ఫారెస్ట్ అధికారులు పట్టుకొని సీజ్ చేశారు.
2023 సంవత్సరంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర పాటిగూడెం గ్రామస్తులందరూ కిసాన్ మిత్ర టీం సభ్యులకు కలిశారు. కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ గురించి వివరించాం. 2023 జులై 11 వ తారీకున ఆ రైతులతో ITDA PO ప్రాజెక్టు అధికారి ఉట్నూరులో దరఖాస్తు పెట్టించాం. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో కూడా జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టించాం. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కు చెందిన రైతులు కాబట్టి పక్క మండలం వేమనపల్లి గ్రామపంచాయతీ చామనపల్లి గ్రామ సభ తీర్మానం ఇవ్వలేదు. చామనపల్లి గ్రామంలోని బీసీలు ఎస్సీలు గొడవ చేస్తామని హెచ్చరించడంతో స్థానిక అటవీ హక్కుల కమిటీ వాళ్ళు కూడా తీర్మానం ఇవ్వలేదు. 2025 సంవత్సరంలో కోనంపేట గ్రామస్తులు అటవీ భూములను సాగు చేసి విత్తనాలు వేయడంతో ఫారెస్ట్ అధికారులు కేసులు పెట్టారు. ఈ భూముల మీదికి మళ్ళీ రాబోమని తీర్మానం ఇవ్వమని అడిగారు. కానీ గ్రామస్తులు మళ్ళీ కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ను సంప్రదించారు. కోనంపేట గ్రామస్తులను తీసుకొని సీఎం ప్రజావాణి హైదరాబాద్ కు వెళ్ళాం.

ప్రజావాణి నోడల్ అధికారి దివ్య గారిని కలిసి వినతి పత్రం సమర్పించడంతో, మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలు మన లెటర్ పంపించి ఫోన్ లో కూడా మాట్లాడారు. ఫారెస్ట్ అధికారులు పోడు రైతులపై పెట్టిన కేసులు కొట్టేశారని జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయం అధికారులు తెలియజేశారు, ఆదివాసీ కుటుంబాలు పెట్టుకున్న దరఖాస్తులపై ITDAప్రాజెక్టు అధికారి , మంచిర్యాల జిల్లా కలెక్టర్, వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ , పెద్దమనుషులందరినీ పిలిపించి చర్చలు జరిపారు. కిసాన్ మిత్ర రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీహర్ష, రైతు స్వరాజ్య వేదిక నాయకులు బి. కొండల్ రెడ్డి , కిసాన్ మిత్ర కోఆర్డినేటర్ నవనీత, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సీనియర్ కోఆర్డినేటర్ కుమ్ర వినాయక రావు, మంచిర్యాల జిల్లా ఫీల్డ్ కోఆర్డినేటర్ సిద్ధం రమేష్, 2026లో నెన్నెల్ మండలం ఖర్జీ, కోనంపేట గ్రామాలకు వెళ్ళి క్షేత్ర పరిశీలన చేశారు. చామనపల్లి గ్రామస్తులతో అటవీ హక్కుల కమిటీ ఛైర్మన్, పెద్దమనుషులతో FRC కమిటీ తీర్మానం కోసం చర్చించారు. FRC కమిటీ తరపున తీర్మానం ఇస్తాం కానీ, బీసీ కులస్తులు మాపైదాడి చేస్తే బాధ్యులు ఎవరని అడిగారు. గ్రామ సభలో తీర్మానం ఇవ్వనీయరు అని కూడా చెప్పారు. ఆ తర్వాత రోజున మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి గ్రామాల వారిని తీసుకొని వెళ్ళి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారికి సమస్యను వివరించారు. జిల్లా కలెక్టర్ గారు ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత సర్వే చేయిస్తానని హామీ ఇచ్చారు కానీ సర్వే చేయించలేదు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ గారికి ప్రజావాణిలో దరఖాస్తు పెట్టించడం వలన సబ్ కలెక్టర్ గారు తహసిల్దార్ కార్యాలయం నుండి రిపోర్టు తెప్పించుకుంటానని ఆ తర్వాత ఈ సమస్య పైన పరిష్కారం ఎలా చేద్దామనేది ఆలోచిస్తానని అన్నారు, 2026 మే నెలలో ఫారెస్ట్ అధికారులు కందకం తవ్వుదామని చామనపల్లి గ్రామస్తులను, కోనం పేట గ్రామస్తులను పిలిచి తీర్మానాలు ఇవ్వమన్నారు. లేకుంటే ఆదివాసీలు, గిరిజనులు ఉంటే ITDA PO ప్రాజెక్టు అధికారి ఉట్నూర్ దగ్గర ఆధారాలు రాయించుకొని తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది, కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ నుండీ మేము ఒక బృందంగా ఉట్నూర్ ఐటిడిఏ అధికారులను కలిశాము. ITDA AO కు దరఖాస్తు ఇచ్చి చర్చించాము.
ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ తీయడం ప్రారంభించారు.పాటిగూడెం గ్రామస్తులు కిసాన్ మిత్రా హెల్ప్ లైన్ కు మళ్ళీ ఫోన్ చేశారు. కోనంపేట గ్రామస్తులు ట్రెంచ్ దగ్గరికి వెళ్లి అడ్డుకున్నారు.
ఫారెస్ట్ డివిజనల్ చెన్నూర్ అధికారి, ఫారెస్ట్ రేంజ్ అధికారి,ఫారెస్ట్ రేంజ్ అధికారి కృష్ణ పల్లి గారు ఆదివాసి రైతుల దగ్గరకు వచ్చి “ మీరు 2005 కంటే ముందు నుండీ ఈ భూములలో సాగులో ఉంటే మీరు గిరిజనులు అయితే మీ భూములు మీకు వదిలేస్తామని” హామీ ఇచ్చారు.
మీకు గ్రామపంచాయతీ పరిధిలో ఫారెస్ట్ భూముల పట్టాలు ఉన్నాయా లేవా సర్వే చేస్తామని అన్నారు కానీ సర్వే చేయలేదు. భూమి చుట్టూ బౌండరీ ట్రెంచ్ మాత్రం తీస్తాము అడ్డుకోవద్దన్నారు. ఆ తర్వాత మీ భూములు మీకే వదిలేస్తామని చెప్పారు. గ్రామస్తులందరూ రిటర్న్ వచ్చారు.
కోనంపేట గ్రామస్తులు వేమనపల్లి మండలంతహసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు పెట్టుకున్నారు. తహసిల్దార్ అప్పుడు రిపోర్ట్ ఏమని రాశారో ఆ రిపోర్ట్ తీసుకోమని చెప్పారు. వేమనపల్లి మండలం తహసిల్దార్ కార్యాలయానికి వెళ్ళి రిపోర్టు గురించి అడిగితే, తహసిల్దార్ సబ్ కలెక్టర్ బెల్లంపల్లికి రిపోర్ట్ పంపించామని చెప్పారు.
ఫారెస్ట్ రేంజ్ అధికారి రిపోర్టు తీసుకొని జిల్లా కలెక్టర్ కు, ఐటీడీఏ పీవోగారికి దరఖాస్తు చేసుకోమని చెప్పారు.కోనంపేట ఆదివాసీ పోడు రైతులను వెళ్లి విత్తనాలు వేసుకోమని చెప్పారు. ఆదివాసి రైతులందరూ అటవీ భూమిలో దున్నుకొని విత్తనాలు వేసుకున్నారు, ITDA ప్రాజెక్ట్ అధికారి ఉట్నూరు గారికి కలిసి, తమ భూములలో విత్తనాలు వేసుకున్నామని సర్వే చేసి హక్కుపత్రాలు ఇవ్వాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కోరారు. అందుకు ఆయన స్పందిస్తూ, తహసిల్దార్ కార్యాలయం నుండి రిపోర్ట్ తెప్పించుకుంటానని, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ గారికి లెటర్ రాసి పంపిస్తానని, మీ భూములలోకి ఫారెస్ట్ అధికారులు రాకుండా చీఫ్ కన్జర్వేటర్ అఫ్ ఫారెస్ట్ అధికారి శాంతారాముతో, జిల్లా ఫారెస్ట్ అధికారి గారితో కలిసి మాట్లాడతానని,కానీ మీరు వేసుకున్న పంటలను కాపాడుకునే బాధ్యత మీదేనని చెప్పారు.
కిసాన్ మిత్ర సంస్థ తమకు సపోర్ట్ చేసినందుకు మేము విత్తనాలు వేసుకున్నామని గ్రామస్తులందరూ సంతోషపడ్డారు. కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు ధన్యవాదాలు తెలిపారు.
Sidam. Ramesh
7702213236, Mancheriyal, Field Coordinator
No comments yet. Login to start a new discussion Start a new discussion