about - ఆపద్భందు పరిహారం కోసం కిసాన్ మిత్ర కృషి

రైతు కుటుంబం నిరాశలో ఉండగా, ఈ కేసు గురించి మా హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసారు. అప్పటి నుండి ఈ కేసును మనం వరుసగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ఫాలో అప్ చేయడం ప్రారంభించాము.

 · 1 min read

2017 అక్టోబర్ 21న ఆదిలాబాద్ జిల్లా, నేరేడిగొండ మండలం, తేజాపూర్ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ ఆత్రం గిరిజ బాయి గారు పిడుగుపాటుతో మృతిచెందారు. ఈ అకస్మాత్తు ఘటన తర్వాత 2018లో ఆమె కుమారుడు ఆత్రం సురేష్ గారు మీ సేవ ద్వారా ఆపద్భందు పథకం కింద దరఖాస్తు చేశారు. అవసరమైన పత్రాలను మండల రెవెన్యూ కార్యాలయంలో (MRO Office) సమర్పించారు. అయితే, దరఖాస్తు చేసిన పలు సంవత్సరాల తరువాత కూడా పరిహారం (Ex-gratia) మంజూరు కాలేదు.

అనేక మార్లు అధికారులను సంప్రదించినా సరైన స్పందన రాలేదు. రైతు కుటుంబం నిరాశలో ఉండగా, ఈ కేసు గురించి మా హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసారు. అప్పటి నుండి ఈ కేసును మనం వరుసగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ఫాలో అప్ చేయడం ప్రారంభించాము.

గత సంవత్సరం, స్థానిక MRO కార్యాలయాన్ని సంప్రదించినపుడు, అధికారులు "2018లో మేము ఇక్కడ పని చేయలేదు, ఈ కేసు గురించి ఏవిధమైన సమాచారం లేదు" అని తెలిపారు. అయితే, CM ప్రజావాణి ద్వారా మరోసారి ఈ కేసును అధికారికంగా రిజిస్టర్ చేయించాము. అప్పటి నుండి, MRO కార్యాలయం నుండి అధికారిక విచారణ (ఎంక్వైరీ) జరిపి, పత్రాలు మళ్లీ స్వీకరించారు.


ఆపై RDO గారికి లేఖ పంపించారు. అక్కడి నుండి జిల్లా కలెక్టరేట్ C సెక్షన్‌కు కేసు పంపారు.  2025 మార్చిలో కలెక్టర్ గారు ఈ కేసుపై ప్రపోజల్ సిద్ధం చేసి, Principal Commissioner for Disaster Management, తెలంగాణ రాష్ట్రానికి పంపించారు.

    ప్రస్తుతం, ఈ కేసు స్టేట్ లెవల్ లో పెండింగ్ లో ఉంది. రాష్ట్ర స్థాయి లో కిసాన్ మిత్ర బృందం ఈ  ఫాలో అప్ చేస్తుంది.

ఈ ఏడేళ్ళ కాలంగా, ఒక పేద ఆదివాసీ కుటుంబం తమ తల్లి మృతికి న్యాయం కావాలని, ప్రభుత్వ భరోసా కావాలని ఎదురుచూస్తున్నారు. కుటుంబానికి సరైన పరిహారం అందకపోవడం తీవ్ర ఆవేదనకరం. ప్రభుత్వం ప్రకటించిన విధంగా, పిడుగుపాటు మృతులకు G.O. 2 ప్రకారం రూ.6 లక్షల పరిహారం అందించాల్సి ఉంది. కానీ ఆ ప్రయోజనం ఇప్పటికీ లభించలేదు.

ఈ కేసు ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకుని, సంబంధిత అధికారులంతా వేగంగా స్పందించి, నష్టపోయిన కుటుంబానికి ఆపద్భందు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలి.



Sk. Sharukh

Kisan Mitra Adilabad Field Coordinator, 9542084628

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment