about - ఆధార్ లో తప్పు వల్ల రైతు భరోసా నిలిపివేత : బానోత్ సకారాం విజయగాధ

ఆధార్ లో తప్పు వల్ల రైతు భరోసా నిలిపివేత : బానోత్ సకారాం విజయగాధ కిసాన్ మిత్ర సహకారంతో రైతు భరోసా మళ్ళీ పొందిన రైతు.

 · 2 min read

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లింగట్ల గ్రామానికి చెందిన బానోత్ సకారాం తనకు ఉన్న 1.05 ఎకరాలు రెవెన్యూ భూమి కి రైతు భరోసా రావడం లేదని  13-12-2023 రోజున కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కి కాల్ చేసారు.

నేను ఫీల్డ్ కి వెళ్ళి వారిని కలిసాను. బానోత్ సకారాం స్థానిక AEO ని కలిస్తే లాగిన్ లో రైతు చనిపోయారని చూపిస్తోంది అని AEO గారు చెప్పారు అని సకారాం చెప్పాడు.నేను సకారాం డాక్యుమెంట్స్ చూశాను.

సకారాం ఆధార్,  రైతు భీమా, LIC బాండ్ చూస్తె LIC బాండ్ లో ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్ సకారాం ఆధార్ లో ఉన్న లాస్ట్ 4 డిజిట్స్ తో మ్యాచ్ కావడం లేదు.నేను అప్పుడు సకారాం కొడుకును అడిగాను మీ ఇంట్లో వారివి ఆధార్ కార్డులు అందరివీ చూపించండని.  

అప్పుడు సకారాం కొడుకు “మా పెద్ద నాన్న బానోత్ తుకారామ్ రీసెంట్ గా చనిపోయారని” చెప్పారు.  నేను తుకారామ్ ఆధార్ కార్డు చూయించండని అన్నాను.

సకారాం కొడుకు అంకుష్ ఫోన్ లో తుకారామ్ ఆధార్ కార్డు ఉంది. దానిని పరిశీలిస్తే సకారాం LIC బాండ్ లోని లాస్ట్ 4 డిజిట్స్ తుకారామ్ ఆధార్ లోని లాస్ట్ 4 డిజిట్స్ తో మ్యాచ్ అవుతున్నాయి.

తుకారామ్ చనిపోతే సకారాం చనిపొయినట్లు చూపించి తుకారామ్ కొడుకులు రైతు భీమా డబ్బులు తినేసి ఉంటారు అనే అపొహలొ సకారాం కుటుంబం ఉంది.

నేను వారికి అర్థం అయ్యేలా వివరించి , మీ డబ్బులు ఎవరు తీసుకోలేదు.LIC బాండ్ లో తప్పు వల్ల మీకు రైతు భరోసా డబ్బులు రాలేదని చెప్పాను. నేను రెగ్యులర్ గా సకారాం కి రైతు భరోసా డబ్బులు,  కొత్త LIC పాలసీ వచ్చె వరకు AEO తో టచ్ లో ఉంటూ సకారాం స్టేటస్ కనుక్కోని సకారాంకి తెలియజేసాను. సకారాం LIC బాండ్ ఫ్రెష్ గా 14- August- 2024 రోజు నుండే రైతు భీమా LIC enrollment policy effect లోకి వచ్చింది.

కొత్త రైతు గా  రబీ  2024 నుండే ఎన్రోల్మెంట్ అయినా  రైతు భరోసా కొత్త రైతులకి ఎవరికీ పడలేదు.  ఇతనికి కూడా పడలేదు.  సకారాం కి  ఖరీఫ్ 2025 రైతు భరోసా డబ్బులు వారి ఖాతా లో జమ అయినాయి. రైతు కి నేను ఈ విషయం గురించి చెప్పాను.   రైతు చాలా సంతోష పడ్డాడు.

ఈ కేసు గురించి కిసాన్ మిత్ర గా  CM ప్రజావాణి హైదరాబాద్ లో కూడ దరఖాస్తు ఇచ్చాము. CM ప్రజావాణి మొదలు పెట్టి సంవత్సరం అయిన సందర్భంగా ప్రజా భవన్ లో ప్రజావాణి సక్సెస్ మీట్ లో కూడా దివ్య దేవరాజన్ (IAS) మరియు చిన్న రెడ్డి గారి ముందు  సకారాం, నేను ఈ కేసు విజయ గాధ గురించి చెప్పాము.




Sk. Sharukh

Kisan Mitra Adilabad Field Coordinator, 9542084628

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment