about - అనంతపురం జిల్లాలో జీవన రేఖ హెల్ప్ లైన్ ప్రారంభం
అనంతపురం జిల్లాలో REDS అనే స్వచ్చంధ సంస్థ గత 30 సంవత్సరాలుగా రైతులు, ఒంటరి మహిళల సమస్యల మీద పని చేస్తున్నది.
రైతు ఆత్మహత్యల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రభావితమైన ప్రాంతాలలో అనంతపురం జిల్లా ఒకటి. ఈ జిల్లాలో 2021 నుండీ రైతు ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయి. 2014 నుండీ ఇప్పటి వరకూ ఈ ఒక్క జిల్లాలోనే 600 కు పైగా రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయి.
అనంతపురం జిల్లాలో REDS అనే స్వచ్చంధ సంస్థ గత 30 సంవత్సరాలుగా రైతులు, ఒంటరి మహిళల సమస్యల మీద పని చేస్తున్నది. అనంతపురం జిల్లా కలెక్టరేట్, REDS సంస్థల మధ్య జరిగిన చర్చల్లో, జిల్లా స్థాయిలో ప్రత్యేకమైన రైతు ఆత్మహత్య నివారణ ప్రయత్నం అవసరమని గుర్తించారు.
తెలంగాణ లో రైతు ఆత్మహత్య నివారణ మరియు క్షేత్ర స్థాయిలో రైతు సమస్యలను అర్థం చేసుకుని కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ద్వారా వివిధ జిల్లాలలో చేసిన ప్రయత్నాలు REDS సంస్థ కలెక్టర్ కార్యాలయం దృష్టికి తీసుకు వెళ్ళింది. అనంతపురం జిల్లా అప్పటి సంయుక్త కలెక్టర్ కేతన్ గార్గ్ దీనిపై స్పందించి, అనంతపురంలోరైతు ఆత్మహత్యల నివారణకు జీవన రేఖ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో, REDS సంస్థ సహకారంతో 31-12-2022 న ప్రారంభించారు. అన్ని రైతు భరోసా కేంద్రాల దగ్గర హెల్ప్ లైన్ నెంబర్ తో పోస్టర్స్ అతికించి, ప్రచారం చేసారు.
జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వరంలో ఒక ఫోన్ నంబర్ ఇవ్వడంతో పాటు, కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ నెంబర్ కూడా ప్రచారం చేశారు. ఈ జీవన్ రేఖ హెల్ప్ లైన్ నంబర్ కు ఇప్పటి వరకూ వ్యవసాయ, రెవిన్యూ విభాగాలకు సంబంధించి సుమారు 460 సమస్యలు వచ్చాయి .

హైదరాబాద్ తార్నాకలో ఉన్న కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కార్యాలయంలో ఉండే కౌన్సిలర్లు ఫోన్ ద్వారా రైతులు చెప్పే సమస్యలను ఓర్పుగా విని, సమస్య తీవ్రతను బట్టి సంబంధిత ప్రభుత్వ అధికారులను వెంటనే స్పందించమని కోరతారు. అత్యవసరం కాని సమస్యలను సాధారణ ఫిర్యాదు ప్రక్రియ ద్వారా పరిష్కారానికి కృషి చేస్తారు.
వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో ఒక కస్టోడియన్ కమిటీ ఏర్పాటు చేశారు. మండల స్థాయి కస్టోడియన్ కమిటీకి మండల వ్యవసాయ అధికారి, నోడల్ అధికారి మరియు కన్వీనర్ గా ఉంటారు. డిప్యూటీ తహసీల్దార్, ఈఓ, పీఆర్ & ఆర్డీ, ఏపీఎం, డీఆర్‌డీఏ, మండల పోలీస్ స్టేషన్ నుండి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ /హెడ్ కానిస్టేబుల్ కమిటీ సభ్యులుగా ఉంటారు.
కిసాన్ మిత్రా బృందంతో కలిసి కస్టోడియన్ కమిటీ అధికారులు ఒత్తిడిలో ఉన్న రైతు కుటుంబాలను సందర్శించారు. వారిని చాలా సున్నితంగా కౌన్సెలింగ్ చేసి, వారి కష్టాలను అర్థం చేసుకుని ,వెంటనే సంబంధిత శాఖలతో సంప్రదించి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను వారికి అందించ డానికి తోడ్పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారాక , జీవన రేఖ హెల్ప్ లైన్ రైతులకు అందుబాటులో లేదు, కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ మాత్రం ఎప్పటిలాగే REDS సంస్థ సహకారంతో అనంతపురం, సత్య సాయి జిల్లాలలో రైతుల సమస్యల మీద పని చేస్తోంది.
Cheruvu. Vandana
9966652776, AP Coordiantor
No comments yet. Login to start a new discussion Start a new discussion