about - అటవీ హక్కుల గుర్తింపు కోసం కోయపోషగూడ గ్రామస్తుల పోరాటం
2004లో ఆ కుటుంబాలు అడవి భూమిని సాగు చేస్తున్నప్పుడు ఫారెస్ట్ అధికారులు అడవిని నరికినందుకుగాను కేసులు పెట్టారు. ఆ ప్రాంతంలో పని చేస్తున్న సిపిఎం పార్టీ నాయకులు ఈ కేసులకు సంబంధించి ఎవరెవరు జైలుకు వె
2005 డిసెంబర్ 13 నాటికి అటవీ భూములను సాగు చేస్తూ ఉన్నవారికి ఆ భూమి పై హక్కులు కల్పిస్తామని 2006 అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట గ్రామం కోయపోషగూడ హాబిటేషన్ లోని ఆదివాసీ నాయక్ పోడు తెగకు చెందిన 40 కుటుంబాల వారు ఆ గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు. వారికి ఓటర్, రేషన్, ఆధార్ కార్డులు కూడా మంజూరయ్యాయి. వాళ్ళెవరికీ సొంత భూములు లేవు. అందుకోసం వారు 1990 సంవత్సరం కంటే ముందే ఒకసారి అడవిని వ్యవసాయం కోసం (పోడు ) నరికారు.2002 నుండీ కొద్ది కొద్దిగా సాగు చేసుకున్నారు.
2004లో ఆకుటుంబాలు అడవి భూమిని సాగు చేస్తున్నప్పుడు ఫారెస్ట్ అధికారులు అడవిని నరికినందుకుగాను కేసులు పెట్టారు. ఆ ప్రాంతంలో పని చేస్తున్నసిపిఎం పార్టీ నాయకులు ఈ కేసులకు సంబంధించి ఎవరెవరు జైలుకు వెళ్లాలో నిర్ణయించి వారిని పంపించడం, తీసుకురావడం చేసేవారు. కానీ వారికి ఆ కాలంలో అటవీ హక్కు పత్రాలేమీ రాలేదు. ఆ కుటుంబాలలో వారసులు కూడా వ్యవసాయాన్ని కొనసాగించారు.2019 నాటికి ఆయా కుటుంబాలలో మూడవ తరం వచ్చింది.
ఆదివాసీ రైతులు మొక్కజొన్న, జొన్న, పెసర వంటి పంటలు సాగు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఫారెస్ట్ అధికారులు వారి మీద కేసులు పెట్టారు. అయినా వారు వారు సాగు కొనసాగించారు. ఈసారి ఫారెస్ట్ అధికారులు “మీరు మొత్తానికి ఇక్కడ వ్యవసాయం చేయొద్దు” అని బెదిరించారు. ఆ కారణంగా రెండు మూడు సంవత్సరలు వారు సాగులో లేరు. మళ్ళీ 2021 సంవత్సరంలో సాగు లోకి వెళ్లారు. అందుకు గాను ఆ ఊరిలో ఉన్న ఆడవాళ్ళందరి మీదా కేసులు పెట్టి గ్రామానికి చెందిన 12 మంది మహిళలను ఉట్నూరు జైలుకు తీసుకెళ్లి 12 రోజులు జైల్లోనే ఉంచారు. తర్వాత విడుదల చేశారు. కోయపోషగూడెం గ్రామ రైతులు ఇటీవల సీఎం ప్రజావాణి లో దరఖాస్తు ఇచ్చారు. ప్రజా వాణి నోడల్ ఆఫీసర్ గాఉన్న దివ్య దేవరాజన్ కలెక్టర్ కి ఫోన్ చేసి ఆ విషయాల పైఆరా తీశారు. కలెక్టర్, ఆ గ్రామాన్ని పరిశీలించి అక్కడ అటవీ హక్కుల కమిటీ ని ఏర్పాటు చేసి గ్రామసభ ఏర్పాటు చేసి అటవీ హక్కుల గుర్తింపు సర్వే చేసి వారికి హక్కు పత్రాలు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు.
తర్వాత కొన్ని రోజులకు అటవీ హక్కుల కమిటీ వేశారు కానీ గ్రామ సభను ఏర్పాటు చేయలేదు. దీనిపై మళ్ళీ కలెక్టర్ ను అడిగితే ఆయన గ్రామపంచాయతీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గ్రామసభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎలక్షన్స్ అయిపోయి చాలా రోజులవుతుంది. కానీ ఇంకా గ్రామ సభ ఏర్పాటు చేయలేదు. ఆ గ్రామంలోని వారందరూ సాగు చేయనీయకుండా ఉన్నప్పుడు పక్క గ్రామాలకు కూలి పనులు చేయడానికి వెళ్ళేవాళ్ళు.
ఇంతకుముందు కనీసం వారికి చేసుకోవడానికి పని దొరికేది దాని వల్ల వాళ్ళు వచ్చిన డబ్బులతో రోజు వారీ జీవితాన్ని సాగించేవారు. ఎప్పుడైతే వ్యవసాయంలో యాంత్రీకరణపెరిగిందో, అప్పటినుండీ వీళ్ళకు పని దొరకడం లేదు. అందువల్ల వీళ్లు ఉన్న భూమిలో కనీసం తిండి కోసం మాత్రమే పంటలు సాగు చేసుకోవచ్చని మళ్ళీ సాగులోకి వచ్చారు. ఫారెస్ట్ అధికారులు వారిని భూముల లోకి రానివ్వకుండా మళ్లీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ల మీద కేసులు పెడుతున్నారు.
ఈ గ్రామస్తులు 2004 నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వంతో పోరాడుతూ వస్తున్నారు. 2026 మార్చి 18 రోజు మళ్ళీ మరోసారి దివ్య దేవ రాజన్ గారిని కలిశారు. ఆమె వారిని ఆ భూములలో వారికి ఆదాయాన్ని ఇచ్చే చెట్లను నాటమని సూచించారు. వాటి మధ్యలో తిండికి సాగు చేసుకోమని చెప్పారు. మీరు అలా చేస్తే నేను డిపార్ట్మెంట్ తో మాట్లాడి మీకు వాటికి హక్కులు ఇప్పిస్తానని చెప్పారు.ఇప్పుడు ఆ గ్రామస్తులు ఆ పనిలో ఉన్నారు.

Katta. Navaneetha
KisanMitra, Coordinator
No comments yet. Login to start a new discussion Start a new discussion