about - అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం” క్షేత్ర స్థాయి కార్యకర్తల కార్యాచరణ
ఎం ఎస్ స్వామినాథన్ 2011 లో రాజ్య సభలో ప్రవేశపెట్టిన మహిళా రైతుల హక్కుల బిల్లు 'రైతు' అనే పదానికి సమగ్రమైన, జెండర్ -తటస్థ నిర్వచనాన్ని ప్రతిపాదించింది. ఇందులో భూమిలేని కూలీలు, కౌలుదారులు, కౌలు రైతులు
రైతు అంటే ఎవరు?
రెవెన్యూ రికార్డులలో ఎవరి పేరు మీద భూమి నమోదై ఉంటుందో ఆ వ్యక్తా?
లేక
వాస్తవానికి వ్యవసాయ ఉత్పత్తిలో నిమగ్నమై ఉండే వ్యక్తా?
ఎం ఎస్ స్వామినాథన్ 2011 లో రాజ్య సభలో ప్రవేశపెట్టిన మహిళా రైతుల హక్కుల బిల్లు 'రైతు' అనే పదానికి సమగ్రమైన, జెండర్ -తటస్థ నిర్వచనాన్ని ప్రతిపాదించింది. ఇందులో భూమిలేని కూలీలు, కౌలుదారులు, కౌలు రైతులు, మత్స్యకారులు, పశు పెంపకదారులు, సంచార పశుపోషకులు, అడవులపై ఆధారపడి బ్రతికేవారు చేర్చబడ్డారు. దీనితో 'భూమిని కలిగి ఉన్నవారు' అనే నిర్వచనం నుండి 'వ్యవసాయ జీవనోపాధిలో నిమగ్నమైనవారు' అనే నిర్వచనం వైపు దృష్టి మళ్లింది. అయితే, ఈ బిల్లుకు కాలం చెల్లిపోయింది.
2026 ను ఐక్య రాజ్య సమితి “అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం” గా ప్రకటించింది. ఇది వ్యవసాయ రంగంలో మహిళలకు మద్దతుగా విధానాలలో సంస్కరణ లను తీసుకురావటానికి, దాని గురించి అందరిలో అవగాహనను పెంచడానికి, మహిళలకు వ్యవసాయ వనరులపై హక్కులను కల్పించే దిశలో పనిచేయటానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తుంది.
ప్రత్యేకంగా మహిళా రైతుల సంవత్సరం అని ప్రకటించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ముందుగా అర్ధం చేసుకుందాము:
- వ్యవసాయంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ప్రపంచ ఆహార ఉత్పత్తిలో దాదాపు 80% దోహదం చేస్తున్న మహిళలకు రైతులుగా గుర్తింపు లేదు.
- ఆహార/వస్తు ఉత్పత్తి లోనూసామాజిక ఉత్పత్తిలోనూ ప్రధాన భాగస్వామిగా ఉన్న మహిళలకు భూమి వంటి సహజ వనరులపై అధికారం/ హక్కులు లేవు.
- వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబంలోనూ వ్యవసాయంలోనూ నిర్ణయాధికారం లేదు.
- వ్యవసాయ రంగంలో ఏర్పడిన సంక్షోభం కారణంగా ఎక్కువగా ప్రభావితమవుతున్నదీ, ఎక్కువగా నష్టపోతున్నదీ మహిళలే.
- విపరీత వాతావరణ మార్పులు(అధిక వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు, కరువులు మొదలైనవి) వాతావరణ సంక్షోభం మూలంగా కూడా అందరికంటే ఎక్కువగా బాధింప పడుతున్నదికూడా మహిళలే .
- పంట నష్టం, ఆదాయాలు తగ్గిపోవటం వల్ల, ఉన్న ఊళ్ళో పనులు లేక పురుషులు వలస పోవటం మూలంగా కూడా గ్రామీణ మహిళలపైనే అధిక భారం పడుతున్నది, వేధింపులు ఎదుర్కుంటున్నారు.
పైన చెప్పిన అంశాలలో మార్పు రావాలంటే వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మహిళలకు ప్రత్యేక గుర్తింపు, రాయితీలు ఇవ్వడం, వారిలో అవగాహన పెంచటము చాలా అవసరం.
Ashalatha
Makam, మహిళా రైతుల హక్కుల వేదిక
No comments yet. Login to start a new discussion Start a new discussion