about - E 20 పెట్రోల్ తో నిజంగానే సమస్యలు ఉన్నాయి

రెండు స్టీలు గిన్నెలలో పెట్రోలు, ఇథనాల్ తీసుకుని వాటిని మండించి మంట స్వభావాన్ని బట్టి పెట్రోల్ మంచిది కాదని నిర్ధారించారు. అది పూర్తిగా అశాస్త్రీయం. వారు తీసుకున్నది స్వచ్ఛ పెట్రోలు కాదు. మోటార్ సైక

 · 2 min read

ఈ మధ్య చేవెళ్ళ లోక్ సభ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు E20 ఇంధనంపై దేశంలో జరుగుతున్న వివాదానికి స్పందనగా ఒక విడియో చేసి రిలీజ్ చేశారు. అది చూశాము. వారు తమ పార్టీ విధానాన్ని సమర్ధించడానికి చూపిన ప్రయోగ విశ్లేషణ శాస్త్రీయం కాదు. రెండు స్టీలు గిన్నెలలో పెట్రోలు, ఇథనాల్ తీసుకుని వాటిని మండించి మంట స్వభావాన్ని బట్టి పెట్రోల్ మంచిది కాదని నిర్ధారించారు. అది పూర్తిగా అశాస్త్రీయం. వారు తీసుకున్నది స్వచ్ఛ  పెట్రోలు కాదు. మోటార్ సైకిల్ టాంకు నుండి తీసిన E20. అందులో 20 శాతం ఇథనాల్ వుంది. ఆ ప్రయోగంలో లోపాలను పరిశీలిద్దాం.

వాహన ఇంజను లోనూ, గిన్నెలోనూ ఇంధనాన్ని మండించడంలో సామ్యం లేదు. ఇంజను లో ఇంధనాన్ని పూర్తిగా మండడానికి అవసరమైన గాలికంటే అదనంగా కలిపి పీడనంలో దహిస్తారు. అప్పుడు పొగ రాదు. అప్పుడు వచ్చే కాలుష్యంగా  కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ డయాక్సైడ్, విఒసి లు వెలువడతాయి. E20 మండించినపుడు వాహనాలు వదిలే వాయువులో నైట్రోజన్ ఆక్సైడ్ తగ్గి కాన్సర్ కారక ఆల్డిహైడ్లు పెరుగుతాయి. ఇథనాల్ తో కాలుష్యం రాదన్నది సరికాదు.

గౌరవ MP గారు విస్మరించిన విషయాలు:

  1. 100 % ఇథనాల్ E 20 కాదు.
  2. గిన్నెలో మండించడం అంతర్జలన యంత్రంలో (IC Engine) మండించడం కాదు.
  3. కనిపించే పొగ మసి పూర్తి వాయు కాలుష్యం కాదు.
  4. వాహన పొగ గొట్టం నుండి వెలువడే కాలుష్యం మాత్రమే ఇంధన జీవన వలయ (లైఫ్ సైకిల్) పర్యావరణ ప్రభావం కాదు.

MP గారు తన ప్రయోగం నుండి చేసిన నిర్ధారణ పెట్రోలు కంటే ఇథనాల్ మెరుగైన ఇంధనం. ఆయన తీసుకున్నది E 20 గనుక అది ఇథనాల్ కంటే ఎక్కువ కాలుష్య చేస్తదని ఆయన అంగీకరించినట్లే. ఆయన చేసిన ప్రయోగం E20 వ్యతిరేక నిర్దారణే చేసింది.

E 20 లో దిగుమతిపై ఆధారపడే 80 శాతం పెట్రోలే వుంది. నూరు శాతం ఇథనాల్ ఇంధనం తయారు చేసి ఇంధన దిగుమతి ఆపడం అసాధ్యం. ఆహార పంటల నుండి పూర్తి ఇంధన అవసరాలు తీర్చడం అసాధ్యం. అందుకు ఏడాదికి 18.2 కోట్ల టన్నుల (ఏటా 15.4 కోట్ల టన్నుల ఉత్పత్తి) బియ్యం కావాలి. మొక్క జొన్నలైతే ఏడాదికి 21.5 కోట్ల టన్నులు కావాలి. తినడానికి గింజ దొరకదు. ఇథనాల్ కి అవసరమైన పంటలు పండించడానికీ, ధాన్యం నుండి ఇథనాల్ ఉత్పత్తికీ 8700 TMC ల నీరు అవసరమవుతుంది. ఆ స్థాయి నీటి వనరులు దేశానికి లేవు. ఇది ప్రస్తుత వాడకం కంటే 13 రెట్లు.

E 20 కొనసాగాలంటే ఇథనాల్ ఉత్పత్తి కావాలి. ఆ ఉత్పత్తిలో వెలువడే వాయు, జల కాలుష్యం, నీటి వనరులపై భారం, అతి స్వల్ప అదనపు శక్తి లభ్యత పరిగణనలోకి తీసు కోవాలి. ఇన్ని పరిమితులతో ఇథనాల్ ఎప్పటికీ ప్రధాన ఇంధన వనరు కాలేదు.

E 20 తో అదనపు సమస్యలు బయట పడుతున్నాయి. ఇంధన మిశ్రమంలో నీరూ, క్లోరైడ్లూ ప్రమాణాల స్థాయిని మించి వుంటున్నాయనీ, అవి ఇంజన్లకు హానికరమనీ సమాచారం.



DK
Dr. K. Babu Rao

Scientists for people

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment