about - రైతు ఆత్మహత్య బాధిత కుటుంబానికి RDSS అండగా నిలిచింది

సంగారెడ్డి జిల్లా, కోహిర్ మండలం, మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చాకలి అంజయ్య (వయసు 40 సంవత్సరాలు) సొంత భూమి ఒక ఎకరాతో పాటు,  మర

 · 1 min read

సంగారెడ్డి జిల్లా, కోహిర్ మండలం, మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చాకలి అంజయ్య (వయసు 40 సంవత్సరాలు) సొంత భూమి ఒక ఎకరాతో పాటు,  మరో  మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసినాడు. నీటి సౌకర్యం చెరువు కాలువ కింద పండిస్తారు.

పంటలు అల్లం ఆలుగడ్డ నాలుగు సంవత్సరాల నుండి సాగు చేసినారు ఆలుగడ్డ మునిగిపోవటంతో లక్ష రూపాయలు నష్టం జరిగింది. నీళ్లు అందక అల్లం పంట   ఎండిపోయింది. లక్ష రూపాయల నష్టం జరిగింది. వ్యవసాయం కోసం బంధువులు, వడ్డీ వ్యాపారుల దగ్గర  3 రూపాయల వడ్డీకి 3 లక్షల రూపాయల అప్పు తెచ్చుకున్నారు. పంట నష్టంతో మనఃస్థాపానికి గురయి పొలం దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్య సావిత్రమ్మకు తన భర్త ఎక్కడి నుండి  అప్పులు తెచ్చాడో  కూడా తెలియదు.  తన పెద్ద కూతురు పెళ్లి చేసింది. ఇప్పటి 5 లక్షల అప్పు ఉంది. కొడుకు నవీన్ కుమార్ ఇంటర్ చదివి కుటుంబ పోషణ కోసం ఎంఆర్ఎఫ్ కంపెనీలో పని చేస్తున్నాడు.రెండవ కూతురు అనారోగ్యంతో చనిపోయింది. ఉపాధి హామీ పనితో పాటు, రోజువారీ కూలీ కూడా వెళ్తుంది.

రైతు స్వరాజ్య వేదిక ఈ కుటుంబాన్ని సందర్శించి కుటుంబ  యోగక్షేమాలు తెలుసుకుని  ఈ కుటుంబానికి  ఆర్థిక సహాయం అందిస్తే బాగుంటుందని భావించింది. రూరల్ డెవలప్ మెంట్ సర్వీస్ సొసైటీ (RDSS)  జీవనోపాధిగా  కిరాణ షాపు  పెట్టుకోవడానికి ఈ కుటుంబానికి ఆర్ధిక సహకారం 50,000 రూపాయలు అందించింది.

సెప్టెంబర్ 2 న సావిత్రమ్మ కిరాణం షాపు ప్రారంభించారు.

సావిత్రమ్మకు కష్టమొస్తే బాధ అనిపించినప్పుడు చెప్పుకోడానికి ఎవ్వరూ లేరని బాధపడింది. రైతు స్వరాజ్య వేదిక, RDSS సంస్థలు ఎప్పటికీ తనకు అండగా ఉంటాయని భరోసా ఇచ్చాం.




LR
Lakshmi. Ragulapally

Lakshmi. Ragulapally Mob: 9133601396 Field Coordinator, Sangaredyy

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment