about - సమస్య: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN)

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సహాయం మూడు సమాన విడతలుగా, ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్

 · 2 min read

సమస్య: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN)

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సహాయం మూడు సమాన విడతలుగా, ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తున్నది.

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలానికి చెందిన తొడసం కాశీరామ్ అనే రైతుకు PM-KISAN పథకం ద్వారా రావాల్సిన ఆర్థిక సహాయం  అందడం లేదు.

రైతుకు రాష్ట్ర ప్రభుత్వం 2018 అక్టోబర్ 4 న  పట్టా పాస్‌బుక్ జారీ చేసింది. PM-KISAN మార్గదర్శకాల ప్రకారం, 01-02-2019 నాటికి పట్టా పాస్‌బుక్ కలిగి ఉన్న రైతులు పథకానికి అర్హత కలిగి ఉంటారు. ఈ రైతుకు అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకూ  PM-KISAN పథకం కింద ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదు.

ఆన్‌లైన్‌లో PM-KISAN వివరాలను పరిశీలించగా, రైతుకు సంబంధించిన వివరాలు/రిజిస్ట్రేషన్ కనిపించడం లేదు. కానీ రైతు భూమి, పట్టా పాస్‌బుక్‌కు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయి.



ఇదే సమస్యపై సంబంధిత వ్యవసాయ అధికారిని సంప్రదించగా, రైతు తన భూమి వివరాలను సరిగా అప్‌డేట్ చేసుకోవాలని, ఈ ప్రక్రియను రైతు స్వయంగా కూడా చేసుకోవచ్చని తెలిపారు.

రైతు స్వయంగా PM-KISAN పోర్టల్‌లో తన వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, రైతు రిజిస్ట్రేషన్ ఇప్పటికే పూర్తయినప్పటికీ, మళ్లీ Farmer Registration చేసుకోవాలని సూచిస్తూ కింద చూపిన విధంగా సందేశం కనిపిస్తోంది. దీంతో రైతు తన భూమి వివరాలను అప్‌డేట్ చేసుకోలేకపోతున్నారు.



రైతు తన Farmer ID నమోదు ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశానని చెబుతున్నారు. సంబంధిత వివరాలను ఆన్‌లైన్‌లో పరిశీలించగా, కింది విధంగా వివరాలు కనిపిస్తున్నాయి.



ఈ సమస్య ఎందుకు వస్తుందో అర్థం చేసుకోవడానికి రైతు పేరుతో కొత్తగా Farmer Registration చేసేందుకు ప్రయత్నించాము. అయితే, కొత్తగా నమోదు చేసుకునే సమయంలో ఈ రైతుకు కింది విధంగా సందేశం/సమస్య కనిపిస్తోంది.




ఈ సమస్యకు సంబంధించి రైతుకు తదుపరి ఏం చేయాలో స్పష్టంగా తెలియ  లేదు. కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్ ద్వారా మేము ఈ సమస్యను జిల్లా స్థాయి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాము. అయితే, రైతు స్వయంగా ఆన్‌లైన్‌లో Farmer Registration/భూమి వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. కానీ రైతు స్వయంగా ప్రయత్నించినప్పటికీ, పోర్టల్‌లో అవసరమైన ప్రక్రియ పూర్తి కావడం లేదు.

అనంతరం, కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్ ద్వారా ఈ సమస్యను రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాము. అయినప్పటికీ, ఇప్పటివరకు సమస్యకు సరైన పరిష్కారం లభించలేదు. PM-KISAN వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య ఉండటం వల్ల ప్రక్రియ పూర్తి కావడం లేదని అధికారులు తెలియజేస్తున్నారు.

రైతు కుటుంబంలోని ఇతర సభ్యుల పేర్లపై ఎటువంటి భూమి లేదని, తన మొబైల్ నంబర్ తన వద్ద మాత్రమే ఉందని రైతు తెలియజేస్తున్నారు. కాబట్టి, ఇతర కుటుంబ సభ్యుల భూమి లేదా మొబైల్ నంబర్‌కు సంబంధించిన వివరాల వల్ల ఈ సమస్య ఏర్పడే అవకాశం లేదని రైతు చెబుతున్నాడు.

సంబంధిత అధికారులు రైతు వివరాలను పూర్తిగా పరిశీలించి, PM-KISAN పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యను పరిష్కరించి, రైతు అర్హతను నిర్ధారించి, అర్హత ఉన్నట్లయితే PM-KISAN ఆర్థిక సహాయం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.



Pendor. VinodKumar

Pendor. VinodKumar Mob: 9492678545 Field Coordinator, Adilabad

No comments yet.

Add a comment
Ctrl+Enter to add comment